H-4 Visa: భారతీయులకు అమెరికా గుడ్ న్యూస్ .. ఆ కీలక బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

H-4 Visa: అమెరికాలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడే వారి భాగస్వామి, పిల్లలకు ఉద్యోగాలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హెచ్‌-4 వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్‌గా ‘వర్క్‌ ఆథరైజేషన్‌’ వర్తించేలా కీలక బిల్లు ఆమోదం తెలిపింది. 
 

Senate Bill Adds Immigrant Visas And H-1B Family Protections KRJ

H-4 Visa: అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాదారులకు గొప్ప ఉపశమనం కలిగించే ముఖ్యమైన ప్రతిపాదనకు అమెరికా సైనెట్ ఆమోదం తెలిపింది. హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడే వారి భాగస్వామి, పిల్లలకు ఉద్యోగాలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హెచ్‌-4 వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్‌గా ‘వర్క్‌ ఆథరైజేషన్‌’ వర్తించేలా కీలక బిల్లు ‘జాతీయ భద్రత ఒప్పందం’ను ఆదివారం అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు. అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ , డెమొక్రాటిక్ నాయకత్వం మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత 'జాతీయ భద్రతా ఒప్పందం' ఆమోదం లభించింది.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రీన్ కార్డ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు బిగ్ రిలీఫ్ లభించింది. గ్రీన్‌కార్డులు రాకపోవడంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు అమెరికాలో పని చేయలేక, వారి పిల్లలు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.ఈ కీలక బిల్లు ఆమోదం వల్ల సుమారు లక్ష మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా. 

వాస్తవానికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వృత్తి నిపుణులకు హెచ్‌-1బీ వీసా, వారిపై ఆధారపడే భాగస్వాములు, పిల్లల కు హెచ్‌-4 వీసాలను జారీ చేస్తారు. 21ఏళ్లు దాటాక హెచ్‌-4 వీసా లేకుంటే అలాంటి పిల్లలు డీపోర్ట్‌ (తిరిగి స్వదేశానికి పంపడం) అయ్యే అవకాశముంది. హెచ్‌-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (EAD), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి.

ఈ దరఖాస్తు చేసుకున్నా వారికి మాత్రమే ఉద్యోగం చేసేందుకు అవకాశముంటుంది. అయితే.. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే.. దాదాపు  ఏడాది సమయం పడుతుంది. దీనివల్ల హెచ్‌-4 వీసాదారులు తమ ఉద్యోగావకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనల్లో మార్పులు చేసి..హెచ్‌-4 వీసాదారులకు ‘ఆటోమేటిక్‌గా వర్క్‌ ఆథరైజేషన్‌’ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపినట్టు వైట్‌హౌట్‌ వెల్లడించింది. 

ఈ చర్యపై అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ చాలా కాలంగా, దశాబ్దాలుగా విచ్ఛిన్నమైందని అన్నారు. మన దేశ విలువలను కాపాడుకోవడం ద్వారా దేశం సురక్షితంగా ఉంటుంది, మన సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి, ప్రజల పట్ల న్యాయంగా వ్యవహరిస్తారు. అని అన్నారు. 

ఏటా 18 వేల గ్రీన్‌కార్డులు జారీ 

భారతీయ-అమెరికన్ వలసదారులకు మరో శుభవార్త ఏమిటంటే.. ఈ బిల్లు వయస్సు పరిమితిని దాటిన దీర్ఘకాలిక H-1B వీసా హోల్డర్ల పిల్లలకు వారి H-4 హోదాను ఎనిమిదేళ్లపాటు కొనసాగిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఏటా 18 వేల ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు జారీ చేస్తామని బిల్లులో హామీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రతి సంవత్సరం సుమారు 25 వేల మంది K-1, K-2 మరియు K-3 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్‌లకు పని అధికారాన్ని అందిస్తుంది. దీంతో ఇమ్మిగ్రేషన్ పీరియడ్ పూర్తయిన వారికి ఏటా దాదాపు లక్ష హెచ్-4 వీసాలు జారీ చేయనున్నారు.
 
బిడెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ.. ఈ చట్టం చాలా ముఖ్యమైనదని అభివర్ణించారు. H-1B వీసా పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడం వల్ల దాదాపు 10 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందనీ, వారిలో అధిక సంఖ్యలో భారతీయులు ఉంటారు. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. 2022లో అమెరికా ప్రభుత్వం 4.42 లక్షల మందికి H-1B జారీ చేసింది. వీరిలో 73 శాతం మంది భారతీయులే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios