Asianet News TeluguAsianet News Telugu

కరోనాకి రష్యా తొలి వ్యాక్సిన్... నమ్మలేమంటున్న సైంటిస్టులు

దీనికి సంబంధించిన ట్రయల్స్‌ డేటా కూడా ఇంకా విడుదల చేయలేదని, ట్రయల్స్‌ డేటా  లేకుండా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని ఎలా నమ్ముతామని వారు అంటున్నారు. 

Scientists ask: Without trial data, how can we trust Russia's COVID vaccine?
Author
Hyderabad, First Published Aug 12, 2020, 9:59 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా.. తాజాగా.. రష్యా మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ని ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ని తన కుమార్తెకు కూడా వేయించినట్లు ఆయన  చెప్పారు.

అయితే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను విమర్శిస్తున్నారు. థర్డ్ ఫేస్ ట్రయల్స్ అవ్వకుండానే మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్‌ను ఎలా తీసుకువస్తారని  చాలా మంది శాస్త్రవేత్తలు  ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన ట్రయల్స్‌ డేటా కూడా ఇంకా విడుదల చేయలేదని, ట్రయల్స్‌ డేటా  లేకుండా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని ఎలా నమ్ముతామని వారు అంటున్నారు. 

అయితే ఈ వ్యాక్సిన్‌ మొదటి, రెండవ ట్రయల్స్‌ మంచి ఫలితాలను ఇచ్చాయని, ధర్డ్‌ ట్రయల్‌ రష్యా అధ్యక్షుడి కుమార్తె పైనే ప్రయోగించినట్లు పుతిన్‌ తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ కచ్ఛితంగా కరోనా మహమ్మారిని తరిమి కొడుతుందని, ఈ వ్యాక్సిన్‌ వేసుకుంటే 2 సంవత్సరాల వరకు కరోనా వైరస్‌ దరిచేరదని ఆయన ధీమా వ్యకం చేశారు. అయితే ఇది ఒక బాధ్యతారాహిత్యమైన నిర్ణయమని అనేక మంది శాస్త్రవేత్తలు అంటున్నారు. 

ఒక వేళ ఈ వ్యాక్సిన్‌ను వేసుకుంటే ఎలాంటి సైడ్‌ ఎఫ్టెక్స్‌ వస్తాయో ఇంకా సరిగా అధ్యయనం జరగలేదన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న తరువాత కరోనా వస్తే దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అనుమానం వ్యకం చేస్తున్నారు. ఇలా సరిగా పరీక్షించని వ్యాక్సిన్‌ను అనేక మంది ప్రజలపై ప్రయోగించడం అనైతికమని వారు అంటున్నారు. వ్యా‍క్సిన్‌ ట్రయల్స్‌ డేటాను, సేఫ్టీ డేటాను అమెరికా, యూరప్‌తో పాటు పలు దేశాలకు సమర్పించాలని అప్పుడే ఈ వ్యాక్సిన్‌కు లైసెన్స్‌ లభిస్తుందని పలువురు ఉన్నతవర్గాలకు చెందిన అధికారులు తెలిపారు.  ఇదిలా వుండగా ఇప్పటికే రష్యా వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూలు కడుతూ, బిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ ఇస్తున్నాయి.   

Follow Us:
Download App:
  • android
  • ios