ఉగ్రవాదులుగా పనిచేసిన వారితో పాటు ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడిన 81 మందికి ఒకే సారి సౌదీ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది.

దుబాయ్: ఉగ్రవాదంతో పాటు హత్యల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన 81 మందికి శనివారం నాడు Saudi Arabia లో సామూహికంగా మరణ శిక్ష అమలు చేశారు.1979లో Makkah Masjid ను స్వాధీనం చేసుకున్న 63 మంది Terrorist లకు 1980 జనవరిలో killed అమలు చేశారు. ఆ తర్వాత ఇంత మందికి ఒకేసారి మరణ శిక్ష అమలు చేయడం ఇదే తొలి సారి.

పిల్లలు, మహిళలను హత్య చేసిన వారితో పాటు ఉగ్రవాదులుగా పని చేసిన వారు కూడా ఉన్నారని స్థానిక ప్రభుత్వ మీడియా తెలిపింది. Al Qaeda, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు, యెమెన్ హౌతీ మద్దతు దారులు కూడా మరణశిక్షకు గురైన వారిలో ఉన్నారు.నిందితులకు న్యాయవాదులు తమ సహాయం అందించారు. న్యాయ ప్రక్రియలో సౌదీ చట్టం ప్రకారం పూర్తి హక్కులు కల్పించినట్టుగా మీడియా ప్రతినిధులు తెలిపారు.

2016 జనవరిలో 47 మందిని Hang తీశారు. షియా మత గురువు సహా పలువురిని ఉరి తీశారు.2019 లో 37 మంది సౌదీ పౌరులను తల నరికి చంపారు. వీరిలో ఎక్కువగా షియాలున్నారు. తీవ్రవాద సంబంధిత నేరాలకు పాల్పడినందుకు మరణ శిక్ష విధించారు. 1980 జనవరిలో మక్కాలోని మసీదును స్వాధీనం చేసుకొన్న దోషులు 63 మందికి కూడా మరణ శిక్ష విధించారు. వీరికి కూడా తల నరికి మరణశిక్ష విధించారు.

ప్రార్ధనా స్థలాలు, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడం భద్రతా అధికారులను హత్య చేసిన నేరం చేసిన వారిని 81 మందికి మరణ శిక్ష అమలు చేశారు. నిందితులపై కోర్టులో విచారణ నిర్వహించిన తర్వాత దోషులుగా నిర్ధారించిన వారికి మరణ శిక్ష అమలు చేసినట్టుగా సౌదీ ప్రభుత్వం తెలిపింది. మరణ శిక్ష తీర్పులను అప్పీల్ కోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆమోదించిందని కూడా సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. దోషులుగా తేలిన వారిలో ఐఎస్ఐఎస్‌తో కలిసి భద్రతా అధికారిని హతమార్చారు.


కింగ్ సల్మాన్ అతని కుమారుడు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో వివిధ కేసులలో దోషుల శిరచ్ఛేదం నిర్వహించారు. సౌదీ అరేబియాలో మరణశిక్ష కేసుల సంఖ్య కరోనావైరస్ మహమ్మారి సమయంలో తగ్గింది. .అమాయక పురుషులు, మహిళలు, పిల్లల హత్యలతో సహా వివిధ నేరాలకు పాల్పడిన దోషులు ఉన్నట్లు తెలిపింది. ఉరితీసిన వారిలో కొందరు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు, యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల మద్దతుదారులని కూడా ప్రభుత్వం తెలిపింది. మరణశిక్ష పడిన వారిలో సౌదీ అరేబియాకు చెందిన 73 మంది యెమెన్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. ఒక సిరియన్ పౌరుడికి కూడా మరణశిక్ష విధించారు. అయితే మరణశిక్ష ఎక్కడ విధించారనేది మాత్రం వెల్లడించలేదు.

సౌదీ అరేరియాలో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటిని ఎవరు ఉల్లంఘించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అంతే కాదు ఇక్కడ ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో సౌదీ ఆరేబియా అగ్రస్థానంలో ఉందంటే అక్కడి ప్రభుత్వాలు నేరస్తుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సౌదీ అరేబియాలో చట్టం పేరుతో ఇలా బలవంతంగా ప్రాణాలు తీసే విధానాన్ని ప్రపంచ దేశాలు, మానవహక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎన్నో సార్లు ఖండించాయి. ఇలాంటివి జరిగిన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

సౌదీ అరేబియా 81 మందికి ఒకేసారి మరణశిక్ష విధించడాన్ని మానవ హక్కుల సంస్థలు విమర్శించాయి. మహ్మద్ బిన్ సల్మాన్ సంస్కరణకు హామీ ఇచ్చినప్పుడు రక్తపాతం తప్పదని ప్రపంచం ఇప్పటికైనా తెలుసుకోవాలని లండన్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ రిప్రైవ్ డిప్యూటీ డైరెక్టర్ సొరయా బోవెన్స్ అన్నారు. మరణశిక్ష విధించడం ద్వారా మానసికంగా, శారీరంగా హింసించారన్నారు.