Asianet News TeluguAsianet News Telugu

సంఝౌతా ఎక్స్ ప్రెస్ కి గ్రీన్ సిగ్నల్

సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలు మళ్లీ మొదలుకానున్నాయి. భారత్-పాక్ ల మధ్య నడిచే ఏకైక రైలు సర్వీస్ ఇదేనన్న విషయం అందరికీ తెలిసిందే. 

Samjhauta Express Services Restored Day After Wing Commander's Return, to Chug Off from India Tomorrow
Author
Hyderabad, First Published Mar 2, 2019, 4:59 PM IST

సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకలు మళ్లీ మొదలుకానున్నాయి. భారత్-పాక్ ల మధ్య నడిచే ఏకైక రైలు సర్వీస్ ఇదేనన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఇటీవల పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాక్ స్థావరాలపై దాడులు జరిపింది. ఈ క్రమంలో సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను నిలిపివేశారు.

కాగా.. ఈ రైలు సేవలను ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు భారత్, పాక్ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌.. భారత్‌కు అప్పగింత కార్యక్రమం పూర్తైన అనంతరం ఇరు దేశాలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 3న తొలి రైలు ఢిల్లీ నుంచి బయలుదేరనుందని.. తిరిగి సోమవారం లాహోర్ నుంచి రిటర్న్ కానుందని రైల్వే అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios