వైట్ హౌస్ వేడుకల్లో ఉట్టి పడిన భారతీయత.. మోనులో పానీ పూరీ..
అమెరికాలోని వైట్‌హౌస్ లో జరిగిన ఈ వేడుకల్లో భారతీయత ఉట్టి పడింది. ఈ వేడుకల్లో భారతీయ వీధి వంటకమైన పానీ పూరీకి చోటు దక్కింది. ఇండియన్స్ ఎంతోగానే పానీపూరిని అక్కడి అతిథులకు వడ్డించారు.
అమెరికాలోని అధికార భవనం వైట్ హౌస్ లో అదురైన ఘటన చోటుచేసుకుంది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ అద్బుతమైన ప్రదర్శనిచ్చింది. భారతీయ దేశభక్తి గీతం "సారే జహాన్ సే అచ్ఛా"ని మెరైన్ బ్యాండ్ అద్భుతంగా ప్లే చేసింది.AANHPI హెరిటేజ్ మంత్ వేడుకల్లో అరుదైన ఘట్టం చోటుచేసుంది. ఈ వేడుకల్లో US ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లమా ముహమ్మద్ ఇక్బాల్ రాసిన "సారే జహాన్ సే అచ్ఛా".అనే ఈ దేశభక్తి గీతాన్ని భారతీయ అమెరికన్ల అభ్యర్థన మేరకు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ వాయించింది. అమెరికా అధ్యక్షుడి ముందే వారి ప్రదర్శన ఇవ్వడం మరో ప్రత్యేకం.
ఆసియా అమెరికన్, హవాయి, పసిఫిక్ ద్వీపవాసులు (AANHPI) జరుపుకునే హెరిటేజ్ మంత్ వేడుకల్లో భాగంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ “రోజ్ గార్డెన్‌లోని వైట్‌హౌస్‌లో AANHPI హెరిటేజ్ మంత్ వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయని తెలిపారు. వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిన వెంటనే తనకు సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అనే గీతంతో తనని స్వాగతించారని తెలిపారు. తనకు ఈ ప్రదర్శన చాలా బాగా నచ్చిందని తెలిపారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఈ ప్రదర్శన ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. తాను కూడా మ్యుజీషియన్లతో కలిసి పాడటం ప్రారంభించానని తెలిపారు. తాను మరోసారి వాయించమని అభ్యర్థించానని, రెండోసారి వాయించినట్లు చెప్పాడు.
ఈ ప్రసిద్ధ భారతీయ దేశభక్తి గీతాన్ని వైట్‌హౌస్‌లో ప్లే చేయడం ఏడాదిలోపే ఇది రెండోసారి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది జూన్ 23న వైట్‌హౌస్‌లో ప్లే చేశారు. అనంతరం అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ “అమెరికా - భారత్ బంధం బలమైన సంబంధాలలో ఒకటి అని తాను భావిస్తున్నానని తెలిపారు. భారతదేశం అత్యంత ఉత్పాదక భాగస్వామ్య దేశాలలో ఒకటి అని అధ్యక్షుడు బిడెన్ అన్నారు. తాను (US ట్రేడ్ రిప్రజెంటేటివ్) అంబాసిడర్ (కేథరిన్) తాయ్‌తో మాట్లాడుతున్నానని, వారు ఖచ్చితంగా మరిన్ని కొత్త భాగస్వాములను చేరుస్తామని అన్నారు. భారత్ - అమెరికా సంబంధాలు మరింత స్థాయిలో పెరుగుతున్నాయని ఆయన చెబుతున్నారు.
వైట్‌హౌస్ వేడుకల్లో పానీ పూరీ..
అలాగే.. వైట్‌హౌస్ లో జరిగిన ఈ వేడుకల్లో పానీ పూరీ చోటు దక్కింది. భారతీయులు ఎంతోగానే పానీపూరిని( వీధి వంటకం) అతిథులకు అందించారు.వైట్ హౌస్‌లో గతంలో కూడా అనేక సార్లు పానీపూరిని ప్రత్యేక డిష్ గా అందించినట్టు తెలుస్తుంది. ఈవెంట్‌లో పెద్ద సంఖ్యలో ఆసియా అమెరికన్లు, అనేక మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఇప్పటి వరకు వైట్ హౌస్ రిసెప్షన్ మెనూలో సమోసా మాత్రమే కనిపించేది. ఇప్పుడు పానీపూరికి కూడా వడిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ భూటోరియా మాట్లాడుతూ.. తాను గతేడాది జరిగిన పలు వేడుకలో పానీపూరీని వడ్డించారనీ, ఈ సంవత్సరం కూడా తాను పానీపూరి కోసం వెతుకుతున్నాననీ అన్నారు. అంతలోనే ఒక సర్వర్ ఆకస్మికంగా పానీ పూరీ/గోల్గప్ప ను తెచ్చి తన ముందు పెట్టారని.. ఇది అద్భుతమని అన్నారు.