పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోప్‌కి కరోనా: ఆసుపత్రిలో చేరిక

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా బారినపడ్డారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుండి పుతిన్ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్నట్టుగా డిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు.

Russian President Vladimir Putins spokesman hospitalised with coronavirus

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరోనా బారినపడ్డారు. 52 ఏళ్ల పెస్కోవ్ 2008 నుండి పుతిన్ ముఖ్య సహాయకుడిగా కొనసాగుతున్నారు. వైరస్ కారణంగా ఆసుపత్రిలో తాను చికిత్స పొందుతున్నట్టుగా డిమిత్రి పెస్కోవ్ ప్రకటించారు.

కరోనాను అడ్డుకట్ట వేయడంలో రష్యా విజయవంతమైందని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఆ మరునాడే పుతిన్ అధికార ప్రతినిధికి కరోనా వైరస్ సోకింది.ఇక పెస్కోవ్ ఏప్రిల్ 30వ తేదీన చివరిసారిగా పుతిన్ తో కలిసి ఓ సమావేశంలో హాజరయ్యారు.

also read:లాక్‌డౌన్ సడలింపులో జాగ్రత్తలు లేకపోతే కరోనా విజృంభణ: డబ్ల్యు హెచ్ ఓ

లాక్‌డౌన్ సడలింపులు ప్రకటించింది రష్యా. రష్యాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా టెలికాన్పరెన్స్ ల ద్వారానే పుతిన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కరోనా వైరస్ లక్షణాలు కన్పించిన వారు ఎవరు కూడ బయటకు రావొద్దని పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. రష్యాలో మంగళవారం నాటికి 2.32 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు రష్యాలో 2100 మంది మరణించినట్టుగా ఆ దేశం ప్రకటించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios