Russia Ukraine War: తిరిగి పోరాడే ఉక్రెయిన్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అలాగే, తన ప్రత్యేక సైనిక ఆపరేషన్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నామని చెప్పారు. పాశ్చాత్య ఆంక్షల ద్వారా ఎదురయ్యే సవాళ్లు అధికంగా ఉన్నాయని పేర్కొంటూనే.. రష్యా విదేశీ ఒత్తిడికి తట్టుకోగలదని నిరూపించబడిందని అన్నారు.
Russian President Vladimir Putin: రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరు దేశాలకు భారీమొత్తంలో ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్దం కారణంగా దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయి. ప్రపంచదేశాలు హెచ్చరించినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఆంక్షలను లెక్కచేయడం లేదు. అయితే, కొన్ని రోజులుగా రష్యా.. ఉక్రెయిన్ పై అణుదాడికి పాల్పడబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై యావత్ ప్రపంచ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాలకు చెందిన పలువురు నేతలు, ఇతర దేశాల నాయకులు న్యూక్లియర్ బాంబు దాడుల గురించి ప్రస్తావించడం మరింతగా ఆందోళనను పెంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాలనే ఉద్దేశం తమకు తేదని చెప్పారు. అణుదాడికి పాల్పడబోతున్నదనే వార్తలను ఆయన ఖండించారు. అయితే దాని ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి పశ్చిమ దేశాలు చేస్తున్న ఆరోపణ ప్రయత్నాలలో భాగంగా అక్కడ జరిగిన సంఘర్షణ విఫలమవుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ విదేశాంగ విధాన నిపుణుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. రష్యా అణ్వాయుధాలతో ఉక్రెయిన్‌పై దాడి చేయడం అర్థరహితమని అన్నారు. "మేము న్యూక్లియర్ దాడి చేయాల్సిన అవసరం లేదు.. అందులో ఎటువంటి ప్రయోజనం లేదు" అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించే ఉద్దేశం మాస్కోకు లేదని స్పష్టం చేశారు.
"రష్యాను రక్షించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ గతంలో చేసిన హెచ్చరిక అణ్వస్త్ర దాడులు సమానం కాదనీ, కానీ అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం గురించి పాశ్చాత్య ప్రకటనలకు ప్రతిస్పందన మాత్రమేనని అన్నారు. బ్రిటన్ ప్రధాని అయితే అణ్వాయుధాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నానని ఆగస్టులో లిజ్ ట్రస్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు, ఈ వ్యాఖ్య క్రెమ్లిన్ ను ఆందోళనకు గురిచేసిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆమెరికా, దాని మిత్ర దేశాలపై విమర్శలు గుప్పించారు. యునైటెడ్ స్టేట్స్, దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా వ్యంగ్యాస్త్రాలతో నిండిన సుదీర్ఘ ప్రసంగంలో.. వారు ప్రమాదకరమైన, నెత్తుటి-మురికి ఆధిపత్య ఆటలో ఇతర దేశాలకు తమ షరతులను నిర్దేశించడానికి ప్రయత్నిస్తున్నారని అమెరికా, దాని మిత్రదేశాలపై ఆరోపణలు గుప్పించారు.
పాశ్చాత్య విధానాలు మరింత గందరగోళాన్ని రేకెత్తిస్తాని పుతిన్ అన్నారు. ఫిబ్రవరి 24 న ఉక్రెయిన్ లోకి తన దళాలను పుతిన్ పంపారు. నాటో సభ్యత్వం సహా పలు ఇతర అంశాలు ఇరు దేశాల మధ్య యుద్దానికి కారణమైంది. అమెరికా దాని మిత్రదేశాలు, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ ను మద్దతు ప్రకటించాయి. ఈ యుద్దం ఆపడానికి చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరు దేశాల మధ్య పలుమార్లు జరిగిన చర్చలు కూడా సఫలం కాలేదు. కాగా, అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ.. పుతిన్ ప్రసంగంపై స్పందిస్తూ.. "మిస్టర్ పుతిన్ వ్యూహాత్మక లక్ష్యాలు ఇక్కడ మారాయని మేము నమ్మడం లేదు. ఉక్రెయిన్ సార్వభౌమ, స్వతంత్ర జాతీయ-రాజ్యంగా ఉనికిలో ఉండాలని ఆయన కోరుకోవడం లేదు" అని కిర్బీ అన్నారు.
