మాస్కో: రష్యాలో విపక్ష నేత అలెక్సే నావల్సీ గురువారం నాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విష ప్రయోగం వల్లే ఆయన అస్వస్థతకు గురైనట్టుగా వైద్యులు ప్రకటించారు. 

నావల్సీ ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నట్టుగా  ఆయన అధికార ప్రతినిధి  కిరా యార్మిష్ తెలిపారు.సోషల్ మీడియా వేదికగా నావల్సీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె తెలిపారు.

సైబీరియాలోని టాంస్క్ నుండి మాస్కో కు విమానంలో వస్తున్న సమయంలో  అస్వస్థతకు గురైనట్టుగా ఆమె చెప్పారు.

అలెక్సీ తాగిన టీ లో విషం ఉన్నట్టుగా వైద్యులు వెల్లడించినట్టుగా ఆయన తెలిపారు. ఉదయం నుండి టీ మినహా ఆయన ఇతర ఏమీ తీసుకోలేదని యార్మిష్ చెప్పారు. అలెక్సీ నావల్సీ ప్రస్తుతం కోమాలో ఉన్నారన్నారు.

అలెక్సీకి ఎవరో విషయం ఇచ్చారో ఆమె చెప్పలేదు. కానీ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆసుపత్రికి రావాలని కోరినట్టుగా ఆమె చెప్పారు.

నావల్సీ ఓ లాయర్, అంతేకాదు అవినీతి వ్యతిరేక ఉద్యమ కారుడు. క్రెమ్లిన్ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు ఆయనను జైలులో వేశారు. ప్రభుత్వానికి అనుకూల పార్టీకి చెందిన వారు పలుమార్లు ఆయనపై దాడికి దిగారు.

వచ్చే నెలలో రష్యాలో ప్రాంతీయ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అలెక్సీ అతని మిత్రులు ఈ ఎన్నికల కోసం సన్నద్దమౌతున్నారు. ఈ తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కలకలం చోటు చేసుకొంది.అలెక్సీ విమానం ఎక్కే ముందు టాస్కీ విమానాశ్రయం కేఫ్ లో కప్పు టీ తాగాడని యార్మిష్ తెలిపింది.