Russian Foreign Minister: భారతదేశ‌ విదేశాంగ విధానంపై, భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌పై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్ర‌శంస‌లు కురిపించారు. మంత్రి ఎస్‌ జైశంకర్ నిజమైన దేశభక్తుడంటూ అభివర్ణించారు.ప్రపంచలో ఎక్కడా లేని విధంగా భారత్‌ సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. చాకచక్యంగా దౌత్యం నడిపించడంలో జైశంకర్‌ ముందుంటున్నారంటూ పేర్కొన్నారు సెర్గీ లావ్‌రోవ్‌. 

Russian Foreign Minister: భారతదేశ‌ విదేశాంగ విధానంపై రష్యా ప్రశంసలు కురిపించింది. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్.. నిజమైన దేశభక్తుడంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసల‌తో ఆకాశానికెత్తారు. ప్ర‌పంచంలో ఏ ఇత‌ర దేశాలు అవ‌లంభించ‌ని విధంగా భారత్ మాత్రమే సొంత విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోందని.. దౌత్య వ్య‌వ‌హరాల‌ను చాకచక్యంగా నడిపించడంలో మంత్రి జైశంకర్‌ ముందుంటున్నారని సెర్గీ లావ్‌రోవ్ ప్ర‌శంసించారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకోవాలంటూ అమెరికాతోపాటు పలు దేశాలు ఒత్తిడి చేసినా.. ఆ స‌వాళ్ల‌ను ఎదురించి.. తమ దేశ అవసరాల కోసం తప్పదంటూ భారత్‌ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగింది. ఈ నేపథ్యంలోనే రష్యా భారత్ విదేశాంగ విధానంపై ప్రశంసలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ భార‌త దేశ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు ఎదురైనా భారత్‌ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగిందని ప్ర‌శంసించారు. ఈ వ్యవహారంలో భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్‌ వ్యవహరించిన తీరు భేష్ అని ప్ర‌శంసించారు. అందుకే ఆయన నిజ‌మైన దేశభక్తుడు అని మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ ఆకాశానికి ఎత్తాడు. EAM జైశంకర్ తన దేశానికి అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, నిజమైన దేశభక్తుడు అని అన్నారు . భారతదేశానికి ఏమి అవసరమో దాని ఆధారంగా తాము దేశం భద్రత కోసం, అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చాలా దేశాలు ఇలాంటివి చెప్పలేవని అని రష్యా మంత్రి అన్నారు. 

 భార‌త్ - ర‌ష్యా సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఆహార భద్రత, రక్షణ లేదా కొన్ని వ్యూహాత్మక రంగాల కోసం రష్యా తన పాశ్చాత్య సహచరులపై ఆధారపడదని సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. UN చార్టర్‌ను ఉల్లంఘిస్తూ.. చట్టవిరుద్ధమైన చర్యలను ఉపయోగించని అన్ని ఇతర దేశాలతో సహకారానికి తాము సిద్ధంగా ఉన్నామని, వాటిలో భారతదేశం కూడా ఉందనీ, ర‌ష్యా భార‌త్ కు ద్వైపాక్షికంగా సహకరిస్తుందని తెలిపారు. భారత్-రష్యా సంబంధాల గురించి సెర్గీ లావ్‌రోవ్ మాట్లాడుతూ.. “భారతదేశం మాకు చాలా పాత స్నేహితుడు. దాదాపు 20 సంవ‌త్సరాల కిత్రం నుంచి ఇరు దేశాల మ‌ధ్య సంబంధం ఉంద‌నీ, అందుకే భార‌త్ 'వ్యూహాత్మక భాగస్వామ్యం' అని పిలిచామని అన్నారు. 

ప్రధాని మోడీ 'మేక్ ఇన్ ఇండియా' పథకానికి రష్యా ప్రభుత్వం ఇస్తున్న మద్దతు గురించి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 'మేక్ ఇన్ ఇండియా' భావనకు తాము మద్దతు ఇచ్చామనీ. సాధారణ వాణిజ్యాన్ని స్థానిక ఉత్పత్తితో భర్తీ చేయడం ప్రారంభించామని, భారతదేశానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిని వారి భూభాగంలోకి మార్చడం ప్రారంభించామని సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. అలాగే.. ర‌క్ష‌ణ రంగం గురించి మాట్లాడుతూ.. రష్యా రక్షణ రంగంలో భారత్‌కు ఎలాంటి మద్దతునైనా అందించడానికి సిద్ధంగా ఉన్న‌మ‌ని తెలిపారు. తాము భారతదేశం కోరుకునేది ఏదైనా అందించగలమని, రక్షణ సహకారం సందర్భంలో సాంకేతికత బదిలీ ఉంటాయన్నారు.