Russia Ukraine Crisis: గత రెండు వారాలు ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తునే ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆక్రమించిన రష్యా బలగాలు. తాజాగా మారియుపోల్ తూర్పు శివార్లలోని ప్రాంతాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభమైనప్పటి నుంచి వ్యూహాత్మక ఓడరేవు నగరం మారియుపోల్‌పై నియంత్రణ రష్యాకు ప్రాధాన్యతనిస్తోంది.
Russia Ukraine Crisis: పక్షం రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగిస్తునే ఉంది. వందలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది సైనికులు పోరాటంలో వీరమరణం పోందారు. లక్షలాది మంది పౌరులు ప్రాణాలారి చేతులో పెట్టుకుని దేశం విడిచి పారిపోయారు. కోట్ల విలువైన అపూర్వ సంపద ధ్వంసమయ్యింది. ఇప్పటికే రష్యా పలు కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటుంది.
తాజాగా ఉక్రెయిన్‌లో గల మారియుపోల్ తూర్పు శివార్లలోని ప్రాంతాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో 430,000 మంది నివాసం ఉంటారు. యుద్దం ప్రారంభించిన సమయం నుంచి మారియుపోల్‌పై నియంత్రణ రష్యాకు ప్రాధాన్యతనిస్తోంది. మరియూ పోల్ వాసులు వారం రోజులుగా కరెంటు, గ్యాస్, నీరు లేకుండా గడుపుతున్నారు.విద్యుత్, గ్యాస్, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మరియపోల్ తూర్పు ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే మారియుపోల్ ముట్టడిలో ఇప్పటికే 1,582 మంది ప్రాణాలు కోల్పోయారని మారియుపోల్ అధికారులు శుక్రవారం తెలిపారు.
బుధవారం, ఉక్రెయిన్ ప్రభుత్వం మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై రష్యా షెల్ దాడి చేసిందని ఆరోపించింది. దీంతో ముగ్గురు చనిపోయారు.ఉక్రెయిన్ కోసం ఐక్యరాజ్యసమితి సంక్షోభ సమన్వయకర్త, అమిన్ అవద్, అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడారు. సహాయక కాన్వాయ్ మారియుపోల్‌లోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. సహాయం తీసుకువెళుతున్న అనేక కాన్వాయ్‌లు రష్యన్ షెల్స్‌చే లక్ష్యంగా చేసుకున్నాయని వివరించారు.
నగరంలో మానవతా విపత్తు కొనసాగుతోంది. చనిపోయిన వారిని ఖననం చేయడం కూడా లేదని మరియూ పోల్ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మారియుపోల్‌లోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా షెల్ దాడి చేసిందని, ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపించింది.
ఉక్రెయిన్ కోసం UN సంక్షోభ సమన్వయకర్త, అమిన్ అవద్, అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. సహాయక కాన్వాయ్‌లు మారియుపోల్‌లోకి ప్రవేశించడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. సహాయం తీసుకువెళుతున్న అనేక కాన్వాయ్‌లు రష్యన్ బలాగాలు దాడులు చేస్తున్నాయని తెలిపారు. వాస్తవానికి, ఈ నగరం (పోర్ట్ సిటీ) నుండి ప్రజల తరలింపు అనేక ప్రయత్నాలు చేశామనీ, వాటిలో విఫలమయ్యామని తెలిపారు.
టర్కీలోని ఉక్రేనియన్ రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది, మారియుపోల్‌లోని ఒక మసీదులో ఆశ్రయం పొందిన వారిలో 36 మంది పిల్లలతో సహా 86 మంది టర్కీ జాతీయులు ఉన్నారని పేర్కొంది.ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొంది. "Polissya, Siversky, Pivdennobuzhsky నగరాల్లో రష్యన్ దళాలు బీభత్సం సృష్టించాయని, పలు నగరాలు భారీ నష్టాన్ని చవి చూశాయని పేర్కొంది.
శత్రువు ఇజియం ఉత్తర భాగంలో స్థిరపడిందని, దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను వదిలిపెట్టదని ఉక్రెయిన్ పేర్కొంది. శత్రువులు మారియుపోల్ యొక్క తూర్పు పొలిమేరను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఉక్రెయిన్‌లో గల కివ్, ఖార్కివ్, చెర్నిహివ్, సుమీ మరియు మారియుపోల్ రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.
