ఓ వైపు కరోనా, దాని స్ట్రెయిన్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంటే.. రష్యాలో మాత్రం నైట్ క్లబ్ లు తెరవాలంటూ వినూత్న నిరసనకు దిగారు జనం. పదుల సంఖ్యలో జంటలు మెట్రో రైల్లో ముద్దులు పెట్టుకుంటూ హల్ చల్ చేశారు. 

ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనా వైరస్ కు మొదట వ్యాక్సిన్ ను రిలీజ్ చేసిన దేశం రష్యా. అయినా అక్కడ రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నా సమయంలో మెట్రో రైళ్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.  

బయటకు వచ్చిన సమయంలో తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం చెప్తున్నా, ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు.  పైగా కరోనా నిబంధనలు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. 

ఈనెల 24 వ తేదీన రష్యాలోని యేకటెరింగ్ బర్గ్ మెట్రోలో పదుల సంఖ్యలో ముద్దులు పెట్టుకుంటూ వినూత్నంగా నిరసనలు తెలిపారు.  నైట్ క్లబ్ లు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.  దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.