Russia Ukraine War: అమెరికా నేతృత్వంలోని NATOలో రక్షణ కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు చేర‌బోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స్వీడన్, ఫిన్లాండ్ లు NATOలో చేరితే.. తీవ్ర‌ పరిణామాలు ఎదుర్కోవ‌ల్సి ఉంటుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది 

Russia Ukraine War: గ‌త రెండు నెలలుగా ర‌ష్యా- ఉక్రెయిన్ ల మ‌ధ్య భీక‌ర యుద్దం సాగుతోంది. ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ న‌గ‌రాల రూపురేఖలను కోల్పోయింది. ఎక్కడ చూసిన శిథిలమైన భవనాలు.. శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. పుతిన్ యుద్ధోన్మాదం వలన ఉక్రెయిన్ ను స‌ర్వ‌ నాశనమైంది. నిత్యం బాంబులు, క్షిపణులు, విమానాలతో దాడుల‌కు పాల్ప‌డుతున్నాయి ర‌ష్యాన్ బలాగాలు. ప్రధాన నగరాలలో ఎక్కడపడితే అక్కడ శవాల గుట్టలు పడివుండటం దర్శనమిస్తున్నాయి. ఈ యుద్దంలో ఎంతోమంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయప‌డ్డారు. లక్షలాది మంది ప్రాణాలు చేత‌ప‌ట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నో చోట్ల ఉక్రెయిన్ మహిళలు, యువతులు లైంగిక దాడికి గుర‌య్యారు. 

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ద నేప‌థ్యంలో అమెరికా నేతృత్వంలోని నాటో రక్షణ కూటమిలో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు చేర‌బోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స్వీడన్, ఫిన్లాండ్ NATOలో చేరితే.. తీవ్ర‌ పరిణామాలు ఎదుర్కొవ‌ల్సి ఉంటుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వారాల్లోగా NATO సభ్యత్వం కోసం దరఖాస్తు చేయాలా? వద్దా? అని ఈ వారం నిర్ణయిస్తామని ఫిన్లాండ్ తెలిపింది. అలాగే.. స్వీడన్ కూడా కూటమిలో చేరడం గురించి చర్చిస్తోంది. స్వీడన్, ఫిన్లాండ్ ల‌ను నాటోలోకి తీసుకోవ‌డం అధికారులపై ఆధారపడి ఉంటుంది. అయితే మన ద్వైపాక్షిక సంబంధాల కోసం, మొత్తం యూరోపియన్ భద్రత యొక్క నిర్మాణం కోసం ఇటువంటి చర్య యొక్క పరిణామాలను వారు అర్థం చేసుకోవాలని అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఒక ప్రకటనలో తెలిపారు. NATOలో స్వీడన్, ఫిన్‌లాండ్ సభ్యత్వం అంతర్జాతీయ ప్రతిష్టను బలోపేతం చేయడానికి దోహదపడదని ఆమె తెలిపారు.

ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరాలని నిర్ణయించుకుంటే.. రష్యాకు నాటో సభ్యదేశాలతో ఉన్న సరిహద్దు రెట్టింపవుతుందని, అలాంటప్పుడు తాము సరిహద్దు భద్రతను పెంచుకోవాల్సిఉంటుందని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దేశాలు నాటో కూటమిలో చేరితే బాల్టిక్‌ పరిధిలో నాన్‌ న్యూక్లియర్‌ స్థితి ఉండదనానరు. గల్ఫ్‌ ఆఫ్‌ ఫిన్లాండ్‌లోకి యుద్ధ నౌకలు కూడా పంపాల్సివస్తుందన్నారు. డినేవియాకు సమీపంలో రష్యా అణ్వాయుధాలను మోహరిస్తుంది అని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ గురువారం హెచ్చరించారు. మరోవైపు జపాన్‌ సముద్రంలో రష్యా మిసైల్‌పరీక్షలు నిర్వహించడాన్ని గమనిస్తున్నామని జపాన్‌ తెలిపింది. సీ ఆఫ్‌ జపాన్‌లో అమెరికా, జపాన్‌ సంయుక్త విన్యాసాలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజు రష్యా జలాంతర్గాముల ద్వారా మిసైల్‌ పరీక్షలు నిర్వహించింది.

ఉక్రెయిన్ ఎదురుదాడిలో రష్యా భారీ యుద్ధ నౌక మాస్కోవా దెబ్బతిన్న విష‌యం తెలిసిందే. సముద్రతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలపై గైడెడ్‌ క్షిపణులను ప్రయోగించేందుకు వినియోగించే యుద్ధ నౌక ‘వెస్క్వా’ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌లోని ఒడెసా గవర్నర్‌ మాక్సిమ్‌ మార్చెన్కో వెల్లడించారు. ఈ నేప‌థ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని రష్యా ప్రధాన అధికారిక మీడియా ‘రష్యా 1’ పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌తో రష్యా ఆలోచన పక్కదారి పట్టిందని హెచ్చరించింది.