Russian Ukraine Crisis: ఉక్రెయిన్ ను ఆక్రమించాలనే కుతంత్రంతో రష్యా ఐదో రోజు కూడా యుద్దాన్ని కొనసాగించింది. ఈ తరుణంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ సరిహద్దుల్లో సోమవారం శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.
Russian Ukraine Crisis: ఉక్రెయిన్ ను ఆక్రమించాలనే కుతంత్రంతో రష్యా ఐదో రోజు కూడా యుద్దాన్ని కొనసాగించింది. ఈ తరుణంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ సరిహద్దుల్లో సోమవారం శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు ఏకాభిప్రాయం రాకపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి.
తాజా పరిణామాలు:
>> రష్యా, ఉక్రెయిన్ మధ్య బెలారస్ సరిహద్దుల్లో సుమారు ఐదు గంటల పాటు చర్చలు జరిగినా ఫలితం లేదు. బెలారసియన్ సరిహద్దులో కైవ్, మాస్కో మధ్య చర్చల సందర్భంగా ఉక్రెయిన్ తన భూభాగం నుండి అన్ని రష్యన్ దళాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. మరో దఫా చర్చలకు ఇరుదేశాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదే విషయాన్ని రష్యన్ వార్తా సంస్థ స్పుత్నిక్ నివేదించింది.
>> తొలుత బెలారస్ సరిహద్దుల్లో చర్చలు నిర్వహించడంపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషెంకో తో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఫోన్ సంప్రదింపులు జరిగాయి. ఆ తరువాత ఉక్రెయిన్ వెనక్కు తగ్గింది. చెర్నోబిల్ అణ్వస్త్ర కేంద్ర జోన్‌కు బయట బెలారస్ – ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి.
>> చర్చల ప్రారంభానికి ముందు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చల కోసం వేచి ఉండమని తనకు ప్రభుత్వం నుంచి సూచన వచ్చిందన్నారు. సంప్రదింపుల దశలో ఉన్నట్లు తాను ప్రకటించలేనన్నారు.
>> క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని పశ్చిమ దేశాలు గుర్తించినప్పుడు మాత్రమే ఉక్రెయిన్ నుంచి తమ సైనిక బలగాలు వెనక్కు మళ్లుతాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు పుతిన్ స్పష్టం చేశారు.
>> ఉక్రేనియన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి సలహాదారు మిఖాయిల్ పోడోల్యాక్.. రెండవ దఫా చర్చలను సిద్దంగా ఉన్నట్టు ధృవీకరించారు. ఇరు పక్షాలు కొన్ని ప్రాధాన్యతాంశాలను గుర్తించాయి. వాటిపై నిర్దిష్ట నిర్ణయాలు రూపొందించబడ్డాయి. వాటిని అమలు చేయడానికి అవకాశం ఉన్న క్రమంలో.. ఇరు దేశాలు సంప్రదింపులకు సిద్దమవుతాయి. రెండో దఫా చర్చలు సమీప భవిష్యత్తులో జరుగుతాయి. ఈ సమయంలో నిర్దిష్టంగా , ఆచరణాత్మక అభివృద్ధి కోసం చర్చలు జరుతాయి ”అని మిస్టర్ పోడోల్యాక్ తెలిపారు.
>> ఉక్రెయిన్‌లో ఏడుగురు చిన్నారులు సహా 102 మంది పౌరులు మరణించినట్లు ఐరాస వెల్లడించింది. దాదాపు నాలుగు లక్ష మంది ఉక్రెయిన్ ను విడిచి వెళ్లిపోయారని UN ఏజెన్సీ నివేదికలు తెలుపుతున్నాయి. ఇందులో అధిక శాతం మంది పోలాండ్‌లోకి ప్రవేశించారని తెలుపుతున్నాయి. మరికొందరు హంగరీ, రొమేనియా, మోల్డోవా, స్లోవేకియాలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపాయి.
>> పోప్ ఫ్రాన్సిస్ తక్షణమే యుద్దాని ఆపివేయాలని.. ప్రపంచ శాంతి కాపాడలనే దిశగా అడుగులు వేయాలని ఇరు దేశాలకు సూచించారు. పుతిన్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నిలిచిపోయినందున పుతిన్ కృత్రిమ హెచ్చరికలు పని చేయవని వ్యాఖ్యానించింది.
>> ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జనరల్ అసెంబ్లీ నేడు అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే.. భారతదేశం విధానపరమైన ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నది. కానీ మాస్కో, కైవ్ మధ్య చర్చలను స్వాగతించింది.
>> ఉక్రెయిన్ పై రష్యా దాడుల వేగాన్ని కాస్త తగ్గించింది. ఉక్రేనియన్ ప్రతిఘటనను ఎదుర్కొన్న తర్వాత రవాణా, సరఫరా సమస్యలను ఎదుర్కొంటోందని వైట్ హౌస్ పేర్కొంది. అయినప్పటికీ, రష్యా మిలిటరీ ఉక్రెయిన్‌లో గగనతలం దాడులను చేస్తున్నట్టు పేర్కొంది. ఉక్రెయిన్ పౌరులను మానవ "కవచం"గా ఉపయోగిస్తోందని ఆరోపించింది.
>> మరోవైపు ..ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బెర్లిన్, బాగ్దాద్, క్విటో ల్లో లక్షలాది మంది సంఘీభావ యాత్రలలో పాల్గొంటున్నారు. పుతిన్ కు స్వదేశంలోనూ నిరసన సెగ తగిలింది. రష్యన్ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనకారులు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు 5,000 మందిని అరెస్టు చేసినట్టు పలు నివేదికలు తెలుపుతున్నాయి.
>> యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలను విధించాయి. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ కు మరింత సైనిక మద్దతును అందిస్తామని హామీ ఇచ్చాయి. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ఆ దేశాలు యుద్ధ విమానాలను కూడా పంపుతాయని కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు.
