ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో తాము భారత్ తో సంప్రదింపులు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. రష్యాతో భారత్ కు చాలా కాలం నుంచి స్నేహం ఉందని, అయితే గత దశాబ్దంన్నరగా అమెరికాతో కూడా భారత్ కు స్నేహం పెరిగిందని చెప్పారు.
ఉక్రెయిన్ (Ukraine) లో నెలకొన్నసంక్షోభం విషయంలో అమెరికా భారత్‌తో సంప్రదింపులు జరుపుతుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (joe biden) గురువారం తెలిపారు. గురువారం వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా (Russia) మిలిటరీ ఆపరేషన్‌లో ఇతర దేశాలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించవద్దని అన్నారు. ఒక వేళ అలా చేస్తే తమ నుంచి తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపారు.రష్యా దురాక్రమణపై అమెరికాతో భారత్ పూర్తిగా సహకరిస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాము భారత్‌తో (ఉక్రేనియన్ సంక్షోభంపై) సంప్రదింపులు జరపబోతున్నామని తెలిపారు.
ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ (barath), అమెరికాలు ఒకే మాటపై లేవని అర్థమవుతోందని జో బిడెన్ అన్నారు. ‘‘ష్యాతో భారతదేశానికి చారిత్రాత్మకమైన, చాలా కాలం నుంచి స్నేహం ఉంది. అదే సమయంలో USతో కూడా గత దశాబ్ధంన్నరగా అపూర్వమైన స్నేహం పెరిగింది. ’’ అని తెలిపారు. వైట్ హౌస్, స్టేట్ డిపార్ట్‌మెంట్, దాని జాతీయ భద్రతా మండలి నుండి వివిధ స్థాయిలలో తమ పరిపాలన అధికారులు, భారత అధికారులతో ఉక్రేనియన్ సంక్షోభంపై పూర్తి మద్దతును కోరి ఉంటారని తాను నమ్ముతున్నాని జో బిడెన్ అన్నారు.
ఇది ఇలా ఉండగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో గురువారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు. ఉక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ సాయం చేయాలని ఆ దేశం విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ (Ukraine) లో మొదలైన హింసాత్మక ఘటనలను తక్షణమే ఆపాలని కోరారు. ఉక్రెయిన్, రష్యా మధ్య దౌత్యపరమైన చర్చలు, సంభాషణల కోసం అన్ని వైపుల నుంచి సమిష్టి కృషి అసవరం అని మోడీ పిలుపునిచ్చారు. రష్యా, NATO సమూహం మధ్య నెలకొన్న విభేదాలు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా మాత్రమే పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి వివరించారు. ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి భారతదేశ ఆందోళనలపై కూడా ప్రధాని మోడీ పుతిన్ తో చర్చించారు. అక్కడి స్టూడెంట్లు తిరిగి ఇండియాకు రావడనికి తమ దేశం అత్యంత ప్రధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో యూకే కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. గురువారం బ్రిటన్ రష్యాపై ఆంక్షల ప్యాకేజీని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ వివరాలను ప్రకటించారు. లండన్‌లో రష్యా, ఆ దేశ సంస్థలు డబ్బు సేకరించకుండా నిరోధించడానికి బ్రిటన్ చట్టాన్ని చేస్తుందని చెప్పారు. సైనిక అవసరాలకు ఉపయోపగడే పరికరాల ఎగుమతిని నిషేధిస్తుంది. ఉక్రెయిన్ పై దాడి చేయాలని తన బలగాలను ఆదేశించిన వ్లాదిమిర్ పుతిన్ ను జాన్సన్ నియంతగా అభివర్ణించారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ మరో 7,000 మంది సైనికులను యూరప్‌లో మోహరించనుంది. ‘
