ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను నిలిపివేసేందుకు అమెరికా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపర్చాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుగా యూఎన్ భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న దేశాలు ఓ తీర్మాణాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఈ తీర్మాణానికి భారత్ దూరంగా ఉంది.
ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడి కొనసాగుతోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ పై యుద్దాన్ని నాలుగు రోజులుగా చేస్తూనే ఉన్నాయి. అయితే దీనిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు శుక్రవారం యూఎన్ భద్రతా మండలి (un security council)లో అమెరికా (america), అల్బేనియా (albania) దేశాలు కలిసి రష్యా కు ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్దానికి వ్యతిరేకంగా తీర్మాణాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మాణాన్ని భద్రతా మండలిలో సభ్యులుగా ఉన్న 15 దేశాల్లో 11 దేశాలు ఆమోదించాయి. వెంటనే ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
అయితే రష్యా (Russia)తో భారత్ (barath) కు ఉన్న సంబంధాల కారణంగా మన దేశం ఈ ఓటింగ్ అనుకూలంగా గానీ, వ్యతిరేకంగానే ఓటు వేయలేదు. తటస్థంగా నిలబడి ఓటింగ్ దూరంగా ఉంది. భారత్ పాటు చైనా, యూఏఈలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు. భద్రతా మండలిలో ఈ ఓటింగ్ భారీ మెజారిటీతో ఆమోదం పొందినా ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఎందుకంటే రష్యా కు ఉన్న వీటో అధికారంలో దానిని తిరస్కరించింది.
తాజాగా మళ్లీ అమెరికా (america) తో సహా పలు దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఎండగట్టడానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేకంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే సమావేశానికి పిలుపునిచ్చే విధానపరమైన తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. యూఎన్ భద్రతా సమావేశంలో తటస్థ వైఖరి అవలంభించినట్టుగానే ఇప్పుడు కూడా భారత్ ఈ తీర్మాణంలో ఓటు వేయలేదు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై జనరల్ అసెంబ్లీ (general assembly) అత్యవసర ప్రత్యేక సెషన్ (special session)పై ఓటింగ్ నిర్వహించేందుకు 15 దేశాల భద్రతా మండలి ఆదివారం మధ్యాహ్నం సమావేశమైంది. 1950 నుంచి ఇప్పటి వరకు కేవలం 10 అత్యవసర సాధారణ సమావేశాలు మాత్రమే జరిగాయి. రష్యా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా 11 మంది కౌన్సిల్ సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు.
ఇది ఇలా ఉండగా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (zelensky) రష్యాతో చర్చలు జరపడానికి సుముఖత వ్యక్తం చేశారు. మొదట రష్యా ఆఫర ను తిరస్కరించిన ఆయన తరువాత ఒప్పుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) అణు ఆయుధాలను అప్రమత్తంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే జెలెన్ స్కీ ఈ చర్చలకు అంగీకరించారు. రష్యా నిర్ణయించిన ప్రదేశంలో మొదట చర్చలకు ఒప్పుకోని ఉక్రెయిన్ అధ్యక్షుడు.. వ్లాదిమిర్ పుతిన్ అణు హెచ్చరికతో సమావేశానికి ఒప్పుకున్నారు. కాగా అణు ఆయుధాలను అప్రమత్తంగా ఉంచాలని పుతిన్ తన అధికారులకు సూచించడంతో పట్ల నాటో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుతిన్ అణు హెచ్చరిక ప్రమాదకరమైది, బాధ్యతారహితమైనదని విమర్శించింది. పుతిన్ వ్యాఖ్యలతో అన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగించే స్థితికి వెళ్తే మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ముప్పు ఉన్నది. రెండో ప్రపంచ యుద్దం సమయంలో హిరోషిమా (hiroshima), నాగసాకి (nagasaki)పై దాడి జరిగిన దానిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు.
