ఉక్రెయిన్ లో ఎదురవుతున్న మనవతా సంక్షోభంపై యూఎన్ భద్రతా మండలిలో రష్యా బుధవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానం ఆమోదం పొందలేదు. ఈ ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.
ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ముసాయిదా తీర్మానం బుధవారం ప్రవేశపెట్టింది. అయితే ఇందులో ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. మన దేశంతో పాటు మరో 12 సభ్య దేశాలు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. కాగా రష్యా తీర్మానానికి సిరియా, ఉత్తర కొరియా, బెలారస్ మద్దతు తెలిపాయి. కానీ తీర్మానం ఆమోదం పొందాలంటే తొమ్మిది సభ్య దేశాలు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దీంతో ఆ తీర్మానం వీగిపోయింది.
రష్యా తీర్మానానికి చైనా అనుకూలంగా ఓటు వేసింది. కానీ మిగితా దేశాలు ఏవీ వ్యతిరేకంగా కూడా ఓటు వేయలేదు. భారత్ తో పాటు మిగితా భద్రతా మండలిలోని దేశాల సభ్యులు ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. శాశ్వత, వీటో-విల్డింగ్ కౌన్సిల్ సభ్య దేశం అయిన రష్యా తన ముసాయిదా తీర్మానంపై 15 దేశాల భద్రతా మండలిలో ఓటు వేయాలని పిలుపునిచ్చింది. ‘మానవతావాద సిబ్బందితో సహా పౌరులు, మహిళలు, పిల్లలతో సహా హానికర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు పూర్తిగా రక్షించబడాలని డిమాండ్ చేస్తున్నాం. పౌరులను సురక్షితమైన, వేగవంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించడం కోసం కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి. ఈ దిశగా మానవతా విరామాలపై సంబంధిత పక్షాలు అంగీకరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.’ అని పేర్కొంది.
ఉక్రెయిన్‌పై దాడి విషయాన్ని ప్రస్తావించని రష్యన్ తీర్మానం, వివక్ష లేకుండా విదేశీ పౌరులతో సహా ఉక్రెయిన్ వెలుపల ఉన్న పౌరులు సురక్షితమైన, అడ్డంకులు లేకుండా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అనుమతించాలని, మానవతా సహాయాన్ని సులభతరం చేయాలని అన్ని పార్టీలను కోరింది. మహిళలు, బాలికలు, పురుషులు, వృద్ధులు, వైకల్యాలున్న వ్యక్తుల ప్రత్యేక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఉక్రెయిన్‌లో, చుట్టుపక్కల ఈ విరామాలు అవసరం అని రష్యా తెలిపింది.
తీర్మానంపై ఓటింగ్ తర్వాత ఇతర కౌన్సిల్ సభ్యులు ప్రకటనలు చేయగా, భారత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానాలకు భారత్ గతంలో కూడా దూరంగానే ఉంది. భద్రతా మండలిలో రెండు సార్లు, జనరల్ అసెంబ్లీలో ఒకసారి ఓటింగ్ లో పాల్గొనలేదు. ఆ సమావేశాలకు గైర్హాజరైంది.
ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ స్పందిస్తూ.. ‘ ఏకీకృత నిరసన ఓటు’లో ఉక్రెయిన్‌లో సృష్టించిన మానవతా సంక్షోభానికి నిందలు వేస్తూ రష్యా చేసిన హాస్య తీర్మానానికి భద్రతా మండలిలోని 13 మంది సభ్యులు దూరంగా ఉన్నారని ట్వీట్ చేశారు. రష్యా మాత్రమే సృష్టించిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించమని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ తీర్మానాన్ని ముందుకు తెచ్చే ధైర్యం రష్యాకు ఉండటం నిజంగా ‘‘మనస్సాక్షికి విరుద్ధం’’కి అని థామస్- గ్రీన్ ఫీల్డ్ అన్నారు.
‘‘ యునైటెడ్ స్టేట్స్ ఈ తీర్మానానికి దూరంగా ఉండాలని భావిస్తోంది. ఎందుకంటే క్షీణిస్తున్న మానవతా పరిస్థితులు, యుద్ధం వల్ల ధ్వంసమైన మిలియన్ల మంది జీవితాలు, వారి కలల గురించి రష్యా పట్టించుకోదు. వారు పట్టించుకుంటే, పోరాటం ఆపివేస్తారు. అని తెలిపారు. ‘‘ రష్యా దురాక్రమణదారు, ఆక్రమణదారుడు. ఉక్రెయిన్‌లోని ఏకైక పార్టీ ఉక్రెయిన్ ప్రజలపై క్రూరత్వ ప్రచారంలో నిమగ్నమై ఉంది. దీంతో పాటు వారి నేరాన్ని అంగీకరించని తీర్మానాన్ని వారు ఆమోదించాలని కోరుకుంటున్నారు’’ అని థామస్ తెలిపారు.
UK రాయబారి బార్బరా వుడ్‌వార్డ్ మాట్లాడుతూ.. తమ దేశం భద్రతా మండలిలో లేదా జనరల్ అసెంబ్లీలో ఎలాంటి తీర్మానానికి ఓటు వేయదని చెప్పారు. ఈ మానవతా విపత్తుకు రష్యా మాత్రమే కారణమని గుర్తించలేదని తెలిపారు. ‘‘ అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అన్ని పార్టీలు గౌరవించాలని రష్యా ముసాయిదా పిలుపునిచ్చింది. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని విస్మరించింది. మహిళలు, పిల్లలతో సహా పౌరులకు రక్షణ కల్పించాలని రష్యా ముసాయిదా పేర్కొంది. కానీ రష్యా ప్రసూతి ఆసుపత్రులు, పాఠశాలలు, ఇళ్లపై బాంబు దాడి చేస్తోందని మరిచిపోయింది ” అని వుడ్‌వార్డ్ అన్నారు.
కాగా ఉక్రెయిన్‌లోని మానవతా పరిస్థితిపై బుధవారం UN జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ముందు ఉంచిన మూడు తీర్మానాల్లో రష్యా తీర్మానం ఒకటి. మరో రెండు తీర్మాణాలు పెండింగ్ లో ఉన్నాయి. 193 మంది సభ్యుల జనరల్ అసెంబ్లీలో ఈ తీర్మానాలపై గురువారం ఓటింగ్ జరగనుంది.
