Russia Ukraine war: రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటన్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. రష్యాలో ప్రవేశించకుండా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తోపాటు సీనియర్ మంత్రులతో పాటు మరో 13 మంది అత్యున్నత స్థాయి అధికారులపై రష్యా ఆంక్షలు విధించారు. ఈ మేరకు "స్టాప్ లిస్ట్ ను రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.
Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉంది. ఒక వైపు వెనక్కి తగ్గుతున్నట్టేననీ అనధికారికంగా ప్రకటించినా.. రష్యా మళ్లీ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా ఆర్థికంగా.. దెబ్బతీయడంలో భాగంగా.. అమెరికాతోపాటు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఆంక్షాలు విధించిన దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయన్ కు ఆర్థికంగా, సైనికపరంగా అమెరికా ఎంతో సాయం చేస్తోంది.
ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటన్ కు ఊహించని షాక్ ఇచ్చాడు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తోపాటు సీనియర్ మంత్రులపై తమ దేశంలోకి నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మాస్కో "స్టాప్ లిస్ట్ ను విడుదల చేసింది. ఈ జాబితాలో బ్రిటర్ ప్రధాని బోరిస్ సన్, విదేశాంగ మంత్రి ఎలిజబెత్ ట్రస్ తో పాటు.. భారత సంతతికి చెందిన మంత్రులు యూకే ఛాన్సలర్ రిషి సునక్, హోం సెక్రటరీ ప్రీతి పటేల్, అటార్నీ జనరల్ సుయెల్లా బ్రవర్‌మన్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్ ఉన్నారు. మరింత మంది బ్రిటీష్ నాయకులు, పార్లమెంటేరియన్లను ఈ జాబితాలో చేర్చనున్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించినప్పటి నుంచి.. బ్రిటన్ ఉద్దేశపూర్వకంగానే ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టిందని, కీవ్‌కు శక్తివంతమైన ఆయుధాలను పంపించిందని రష్యా మంత్రిత్వ శాఖ ఆరోపించింది. రష్యాపై ఆంక్షలు విధించేలా ఇతర దేశాలను కూడా ప్రేరేపించిందని ప్రకటనలో పేర్కొంది. వీటన్నింటికీ ప్రతికార చర్యగా యూకే పై ఆంక్షలు విధించినట్టు మాస్కో పేర్కొంది.
అలాగే.. ఉక్రెయిన్ నాటో వైపు అడుగు వేయడంలో బ్రిటన్ కీలక పాత్ర పోషిస్తోందనీ, అలాగే.. రష్యాపై ఆంక్షలను విధించాలని ఇతర దేశాలపైనా బ్రిటన్ ఒత్తిడి చేస్తోందనీ. ఇలాంటి చర్యలను రష్యా ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేసింది. రష్యాను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడం, ఆర్థిక వ్యవస్థను కట్టడి చేయాలని బ్రిటన్ ప్రచారం చేస్తుందని ఆరోపించింది. ఈ మేరకు నిబంధనలు విధించినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం 13 మందిపై ఆంక్షలు విధించామని, త్వరలో రాజకీయ నేతలు, పార్లమెంట్ సభ్యులతో కూడిన మరో జాబితాను విడుదల చేస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
ఇదిలా ఉంటే.. గత వారం యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ నగర వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి పరిస్థితులు గురించి తెలుసుకున్నారు. అక్కడి ప్రజల మనోధైర్యాన్ని పెంచేందుకు తాను పర్యటించినట్టు బోరిస్ చెప్పారు. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌కు రష్యా అండగా నిలుస్తోందని, అలా ఉండటం తమ బాధ్యత అని కూడా బోరిస్ అన్నారు. అంతేకాదు ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను అందిస్తామని, మరింత సాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ప్రశంసలు కురిపించారు.
