Asianet News TeluguAsianet News Telugu

బైడెన్‌పై శాశ్వత నిషేధం విధించిన రష్యా.. ట్రంప్‌కు మాత్రం మినహాయింపు

రష్యాలోకి ప్రవేశించకుండా అమెరికా ప్రముఖులపై ఆ దేశం శాశ్వత నిషేధం విధించింది. ఈ జాబితాలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, హిల్లరీ క్లింటన్, మార్క్ జుకర్‌బర్గ్ వంటివారి పేర్లను చేర్చింది. కానీ, అనూహ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును చేర్చలేదు.
 

russia banned joe biden from entering country.. but left donald trump
Author
New Delhi, First Published May 22, 2022, 3:50 PM IST

న్యూఢిల్లీ: రష్యాలోకి ప్రవేశించకుండా శాశ్వత నిషేధం విధించిన జాబితాను ఆ దేశం ఇటీవలే అప్‌డేట్ చేసింది. ఈ జాబితాలో కొత్తగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేరును రష్యా చేర్చింది. జో బైడెన్‌తోపాటు ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, హిల్లరీ క్లింటన్‌ పైనా రష్యా నిషేధం విధించింది. కానీ, అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్‌ పై నిషేధం విధించలేదు. 

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వ్లాదిమిర్ పుతిన్‌పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ఆయన సొంత ఇంటెలిజెన్స్ అభిప్రాయాలను సైతం పక్కనబెట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బహిరంగంగా ప్రశంసలు కురిపించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా ఆయన పెద్దగా చర్యలు తీసుకోలేదు. వీలైనంత వరకు ఆయనకు అనుకూలంగానే వ్యవహరించాడు.

అమెరికా ప్రముఖులపై రష్యా నిషేధాజ్ఞలు విధించడాన్ని పశ్చిమ దేశాలపై అది తీసుకున్న కౌంటర్ యాక్షన్‌గా చూస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా సహా యూరప్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అంతేకాదు, రష్యాను కట్టడి చేయడానికి ఆ దేశంపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. కానీ, రష్యా మాత్రం వెనుకడుగు వేయలేదు. 

ఈ ఆంక్షలకు ప్రతీకారంగానే రష్యా ప్రభుత్వం అమెరికా ప్రముఖులపై నిషేధాజ్ఞలు విధించినట్టు తెలుస్తున్నది. తాజా చేర్పుతో ఈ జాబితా 963 మందికి చేరింది. వీరంతా రష్యాలోకి శాశ్వతంగా ప్రవేశించలేరు.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌కు చెందిన బిలియనీర్, కైవ్ పోస్ట్ మాజీ పబ్లిషర్ మహ్మద్ జహూర్ (Pakistan Billionaire Mohammad Zahoor) ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర (russia ukraine war) నేపథ్యంలో ఆ దేశానికి అండగా నిలిచారు. దీనిలో భాగంగా యుద్ధంలో సహాయం చేసేందుకు గాను ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు సమకూర్చినట్లు కథనాలు వస్తున్నాయి. 

న్యూస్ వీక్ నివేదిక ప్రకారం... జహూర్ భార్య, ఉక్రేనియర్ గాయని కమాలియా జహూర్ (Kamaliya Zahoor) తన భర్త సహా ఆయన సంపన్నులైన స్నేహితులు రష్యాతో పోరాటంలో భాగంగా ఉక్రెయిన్‌కు గుట్టుగా సాయం చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్ వైమానిక దళం కోసం రెండు ఫైటర్ జెట్‌లను కొనుగోలు చేసినట్లు కమాలియా తెలిపారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు తన భర్త అనుమతి ఇచ్చారని.. ఎందుకంటే యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్న విషయాన్ని వారు గోప్యంగా వుంచారని ఆమె పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios