ఉక్రెయిన్‌లో రష్యా సైనికుల ఆగడాలను వెల్లడించి ఓ కాల్ రికార్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ సైనికుడు రష్యాలోని తన కుటుంబంతో మాట్లాడుతూ.. తాము కుక్కును తిన్నట్టు తెలిపారు. రష్యా ప్రభుత్వం పంపిన రేషన్ ప్యాకెట్లతపై విరక్తి పుట్టిందని వివరించారు. అదే విధంగా 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడిని కూడా ప్రస్తావించారు. 

న్యూఢిల్లీ: దాడులు చేయడానికి ఉక్రెయిన్ చేరిన ఓ రష్యా సైనికుడు తన కుటుంబంతో మాట్లాడిన ఓ కాల్ రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. ఈ కాల్ రికార్డింగ్‌ దారుణ విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఈ రికార్డింగ్‌ను అందిపుచ్చుకుని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ రికార్డింగ్ ప్రకారం, ఉక్రెయిన్‌లో రష్యా సైనికులను ఆకలితో మాంసం కోసం వెతికి వెతికి కుక్కలనూ భుజిస్తున్నట్టు తేలింది. అంతేకాదు, మైనర్ బాలికలపైనా కామ వాంఛ తీర్చుకుంటున్నట్టు తెలిసింది.

ఓ రష్యా సైనికుడు తన కుటుంబంతో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇలా ఉన్నది. సరే.. ఉక్రెయిన్‌లో మీరు కనీసం సరిపడా ఆహారం అయినా తింటున్నారా? అని ఆ జవాన్‌ను కుటుంబ సభ్యులు అడిగారు. దానికి ఆయన షాకింగ్ జవాబు ఇచ్చాడు. ‘నిన్న మేం కుక్కను తిన్నాం’ అని సమాధానం చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు ఖంగు తిని రెండు మూడు సార్లు ఏంటని అడిగారు. దానికి ఆయన స్పష్టంగా తాము నిన్న కుక్కును తిన్నామని నిక్కచ్చిగా సమాధానం ఇచ్చాడు. ఔను.. తాము మాంసం తినాలని భావించామని పేర్కొన్నాడు. తమకు రష్యా ప్రభుత్వం ఇచ్చిన రేషన్ ప్యాకెట్లపై విరక్తి పుట్టిందని సమాధానం ఇచ్చాడు.

అదే సంభాషణలో ఆయన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ప్రస్తావననూ తెచ్చాడు. బహుశా ఆ జవాన్ తల్లి వయసులో ఉండే ఓ ముసలావిడ ‘ఎవరు చేశారు?’ అని ప్రశ్నించారు. తన యూనిట్‌లోని ముగ్గురు జవాన్లు ఆ అఘాయిత్యానికి ఒడిగట్టాడని సమాధానం వచ్చింది. ఈ ఫోన్ కాల్ ఫుటేజీ సుమారు నిమిషం నిడివితో ఉన్నది. దీన్ని కీవ్ సీక్రెట్ సర్వీస్ ఎస్‌బీయూ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. ఈ అకౌంట్‌కు సుమారు 4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఆ రికార్డింగ్‌లో ఉన్న జవాన్ ఉక్రెయిన్‌లో ఏ లొకేషన్‌లో ఉన్నాడనేది.. అలాగే, ఆ రికార్డింగ్ ఎప్పుడు చేశారనేదానిపై స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా ఇటీవలే టర్కీలోని ఇస్తాంబుల్​లో ఇరు దేశాల మ‌ధ్య జరిగిన శాంతి చర్చలు విజ‌య‌వంతమ‌య్యాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. ఉక్రెయిన్ రాజధాని సహా కీలక నగరాల్లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది. మంగ‌ళ‌వారం.. ట‌ర్కీలోని ఇస్తాంబుల్ వేదిక‌గా జ‌రిగిన చ‌ర్చ‌లు విజ‌య‌వంతమ‌య్యాయి. ఇరు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నివార‌ణ దిశ‌గా పురోగ‌తి సాధించామ‌ని ఉక్రెయిన్ ప్ర‌తినిధి చెప్పారు. రెండు దేశాల అధ్య‌క్షుల‌ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల‌కు అవ‌స‌ర‌మైన వాతావ‌ర‌ణం మార్గం సుగ‌మ‌మైంద‌న్నారు. ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌ధానంగా.. ఉక్రెయిన్ భ‌ద్ర‌త‌కు అంత‌ర్జాతీయంగా హామీ కావాల‌ని ఉక్రెయిన్ ప్ర‌తినిధులు ప్ర‌తిపాదించారు. ఈ ప్ర‌తిపాద‌న‌పై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. త‌ద‌నుగుణంగా కీవ్‌తోపాటు చెర్నీహివ్ న‌గ‌రాలు ఇత‌ర ప్రాంతాల నుంచి బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రిస్తామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించింది. ఉక్రేనియన్ దళాలు కీలకమైన కైవ్ శివారు ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయనీ, దేశ రాజ‌ధాని ఉక్రెయిన్ స‌బ‌ర్బ‌న్ ప్రాంతాల‌ను త‌మ ఆధీనంలోకి తీసుకున్న ఉక్రెయిన్ సేన‌లు.. మ‌రియాపోల్‌పై నియంత్ర‌ణ కోసం పోరాడుతున్నాయి. రష్యా నియంత్రణ నుండి రాజధాని వాయువ్యానికి కీలకమైన గేట్‌వేని స్వాధీనం చేసుకున్నామ‌ని ఉక్రెయిన్ అంత‌రంగిక వ్య‌వ‌హారాల శాఖ మంత్రి డెనీస్ మొనాస్టైర్‌స్కై చెప్పారు.