Asianet News TeluguAsianet News Telugu

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీకొన్న .. 20 మంది ప్రాణాలు 

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Road accident in South Africa claims 20 mine company employees KRJ
Author
First Published Oct 5, 2023, 5:05 AM IST

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో మరణించిన వారందరూ డి-బీర్స్ అనే మైనింగ్ కంపెనీలో పనిచేస్తున్నారని స్థానిక అధికారులు తెలిపారు. వెనిషియా గని నుండి ఉద్యోగులందరూ బస్సులో బయలుదేరినట్లు అధికారి తెలిపారు. అయితే బస్సు కొంత దూరం రాగానే లారీని ఢీకొట్టింది.

ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. లింపోపో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు లారీని ఢీకొట్టింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గని నుండి బస్సు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

గనిలో 4,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.  దక్షిణాఫ్రికాలో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు. ఇది ఆందోళన కలిగించే అంశం. వెనిషియా గని దక్షిణాఫ్రికా , జింబాబ్వే సరిహద్దులకు సమీపంలో ఉందని, ఇది వజ్రాల అతిపెద్ద గని . ఇక్కడ 4,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios