గుహలో చిక్కుకొన్న ఆ 12 మందిని నేను కాపాడుతా, రెండే మార్గాలు: మారియో

Rescuers weigh options for extracting boys from Thai cave as more rain due
Highlights

 థాయ్‌లాండ్‌లోని ఓ భారీ గుహలో చిక్కుకున్న 12 మంది బాలురతో పాటు పుట్‌బాల్ కోచ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మెక్సికోలో 69 రోజుల పాటు భూగర్భంలోనే గడిపిన మారియో సెపుల్‌వేదా తెలిపారు.

మెక్సికో: థాయ్‌లాండ్‌లోని ఓ భారీ గుహలో చిక్కుకున్న 12 మంది బాలురతో పాటు పుట్‌బాల్ కోచ్‌ను బయటకు తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మెక్సికోలో 69 రోజుల పాటు భూగర్భంలోనే గడిపిన మారియో సెపుల్‌వేదా తెలిపారు.

2010లో మారియోతో పాటు మరో 32 మంది 10 వారాల పాటు సాన్ జోన్స్ బంగారం, రాగి గనుల్లో గడిపారు. అయితే ఒక్కొక్కరుగా వారంతా గనుల నుండి బయటకు వచ్చారు. అప్పట్లో ఈ వార్త సంచనలంగా మారింది. 

గుహల్లో గడిపిన వారంతా ప్రాణాలతో బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.  అయితే థాయ్‌లాండ్‌లో తాజాగా  12 మంది బాలురు, ఓ పుట్‌బాల్ కోచ్ గుహలో  చిక్కుకుపోయారు.గుహలో చిక్కుకునన్న వారిలో అంతా 16 ఏళ్లలోపు వారే ఉన్నారు. థాయ్‌లాండ్‌లో ఉన్న అతిపెద్ద గుహల్లో వీరంతా చిక్కుకొన్నారు.

గుహలోకి వీరంతా చేరిన కొద్దిసేపటికే భారీ వరద నీరు గుహలోకి ప్రవేశించింది. దీంతో వరద నీటిలో నాలుగు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయారు. గుహలో చిక్కుకున్న వీరిని బ్రిటీష్ గజ ఈతగాళ్లు ఎట్టకేలకు కనిపెట్టారు.

వీరిని కాపాడేందుకు తాను ముందుకు వస్తానని మారియో చెప్పారు.ఈ మేరకు ఓ 40 సెకన్ల వీడియోను ఆయన విడుదల చేశారు. తనకు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. 

 వారిని బయటకు తీసుకురావడానికి మూడు అవకాశాలు ఉన్నాయి. గుహలో ఉన్న దారిలో నీటిలో ఈదుకుంటూ బయటపడటం లేదా గుహ పై నుంచి రంధ్రం చేసి చిక్కుకొన్న వారిని కాపాడే ప్రయత్నం చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇక మూడోది వర్షాలు తగ్గే వరకు వేచి చూడడం కూడ ఒక మార్గంగా చెప్పారు.

గుహలో చిక్కుకొన్న వారిలో ఎవరికీ కూడ ఈత రాదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై సర్కార్ కేంద్రీకరించింది. అయితే తాజాగా  మారియో చేసిన ప్రకటనకు థాయ్‌లాండ్ సర్కార్ ఏ మేరకు స్పందిస్తోందో చూడాలి.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader