Asianet News TeluguAsianet News Telugu

కరోనాకి ప్రయోగాత్మక మందు.. ఆనందం వ్యక్తం చేసిన ట్రంప్

కోవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్‌ తోడ్పడుతుందని తయారీ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ఇక రెమ్‌డెసివిర్‌కు అనుమతులు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి’అని పేర్కొన్నారు. 
 

Remdesivir US allows emergency use of experimental drug for coronavirus
Author
Hyderabad, First Published May 2, 2020, 11:26 AM IST

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. దాదాపు రెండున్నర లక్షల మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా అమెరికాలోనే ఉంది. అక్కడ వైరస్ కారణంగా 60వేల మందికి పైగా  ప్రాణాలు కోల్పోయారు. వైరస్ సోకే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీనిని ఆ దేశ అధ్యక్షుడు అరికట్టేలేకపోతున్నాడు. కాగా.. తాజాగా.. ఓ విషయంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆనందం వ్యక్తం చేశాడు.

 కోవిడ్‌ బాధితుల చికిత్సలో పనిచేసే ప్రయోగాత్మ ఔషదం రెమ్‌డెసివిర్‌కు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతినిచ్చింది. కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన రోగులకు అత్యవసర మెడిసన్‌గా రెమ్‌డెసివిర్‌ యాంటీ వైర‌ల్ ఇంజక్షన్‌ను వాడొచ్చునని తెలిపింది. ఇక కరోనా పుట్టుకొచ్చిన తర్వాత.. వైరస్‌ చికిత్సకు సంబంధించి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుకొని బయటికొచ్చిన తొలి మెడిసిన్‌ ఇదే కావడం విశేషం. 

కోవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఈ మెడిసిన్‌ తోడ్పడుతుందని తయారీ సంస్థ గిలీడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ఇక రెమ్‌డెసివిర్‌కు అనుమతులు వచ్చిన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి’అని పేర్కొన్నారు. 

వైట్‌ హౌజ్‌లో గిలీడ్‌ సైన్సెస్‌ సీఈఓ డానియెల్‌  ఓడేతో ఆయన ముచ్చటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల బాగుకోసం ఇది తొలి అడుగు అని ఓడే పేర్కొన్నారు. నిస్వార్థంగా రెమ్‌డెసివిర్‌తో వారికి సేవ చేస్తామని చెప్పారు. కాగా, 1.5 మిలియన్‌ డోసుల మెడిసిన్‌ను ఉచితంగా అందిస్తామని గిలీడ్‌ సైన్సెస్‌ ఇదివరకే చెప్పింది. 

ఈ మెడిసిన్‌తో బాధితులు 31 శాతం త్వరగా కోలుకుంటారని అమెరికాలోని అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్చువస్‌ డిసీజెస్‌ వెల్లడించింది. ఇది వైరస్ యొక్క జన్యువులో కలిసిపోయి, దాని ప్రతిరూపణ ప్రక్రియను తగ్గించేస్తుందని తెలిపింది. కాగా, రెమ్‌డెసివిర్‌ను తొలుత ఎబోలాపై పోరుకు తయారు చేశారు. అయితే, మరణాలను తగ్గించడంలో ఈ మెడిసన్‌ ప్రభావం చూపలేదని వైద్య వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios