సారాంశం

బాలుడిని ఎత్తుకొని పక్కకు తీసుకువచ్చాడు. అతను కనుక అలా అలర్ట్ అయ్యి, బాలుడిని తీసుకొని రాకపోయి ఉంటే, అందులో ఇరుక్కుపోయేవాడు.

ఫ్లోరిడాలో ఆదివారం ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. కొందరు యువత తమ ఇంటికి సమీపంలో ఉన్న గ్రౌండ్ లో బేస్ బాల్ గేమ్ ఆడుతున్నారు. ఆ సమయంలో సడెన్ గా ఇసుకు తుఫాన్ కమ్మేసింది. దుమ్ముతో కూడిన తుఫాన్ లాగా వచ్చేసింది. అనుకోకుండా వచ్చిన ఈ తుఫాన్ కి అందరూ షాకై అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలో ఓ ఏడేళ్ల చిన్నారి అందులో ఇరుక్కుపోయాడు.

 

ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. తుఫాన్ లో చిన్నారి ఇరుక్కుపోయాడు. ఆ బాలుడీకి అందులో నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాలేదు. దీంతో వెంటనే అక్కడే ఉన్న ఎంఫైర్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. బాలుడిని ఎత్తుకొని పక్కకు తీసుకువచ్చాడు. అతను కనుక అలా అలర్ట్ అయ్యి, బాలుడిని తీసుకొని రాకపోయి ఉంటే, అందులో ఇరుక్కుపోయేవాడు.

ఆ బాలుడిని జోయా గా గుర్తించారు. ఆ బాలుడిని కాపాడిన అంపైర్ కూడా 17ఏళ్ల యువకుడే కావడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసి నెటిజన్లు షాకౌతున్నారు. సడెన్ గా అంత పెద్ద తుఫాన్ ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తుండగా, అంపైర్ ఆ చిన్నారి ప్రాణాలను కాపాడాడు అంటూ అతనిని ప్రశంసిస్తున్నారు.