Asianet News TeluguAsianet News Telugu

Queen Elizabeth II: 63 ఏండ్ల త‌ర్వాత తెర‌వ‌బోయే క్వీన్ ఎలిజ‌బెత్ రాసిన లేఖ గురించి తెలుసా?

Queen Elizabeth II: బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె తన 96వ యేటా తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. 70 ఏళ్లపాటు ఆమె బ్రిటన్‌కు రాణిగా కొనసాగారు.
 

Queen Elizabeth II: Do you know about Queen Elizabeth's letter to be released after 63 years?
Author
First Published Sep 12, 2022, 12:15 PM IST

Queen Elizabeth II: ఈ ఏడాది జూన్‌లోనే బ్రిటన్ పగ్గాలు చేపట్టి 70 ఏళ్లు గడిచిన సందర్భంగా ప్లాటినమ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జ‌రుపుకున్న క్వీన్ ఎలిజ‌బెత్ 2 గ‌త‌వారం క‌న్నుమూశారు. కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె తన 96వ యేటా తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. 70 ఏళ్లపాటు ఆమె బ్రిటన్‌కు రాణిగా కొనసాగారు. ప్లాటినమ్ జూబ్లీ సంద‌ర్భంగా రాయల్ పరేడ్లు, స్ట్రీట్ పార్టీలు, ఇతర విధానాల్లో సంబురాలు చేశారు. తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. అయితే, బ్రిట‌న్ రాణి రాసిన ఒక లేఖ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. దాని గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ వివ‌రాలు మీ కోసం.. ! 

బ్రిట‌న్ క్వీన్ ఎలిజబెత్ II త‌న జీవిత‌కాలంలో అనేక సార్లు ఆస్ట్రేలియాను సంద‌ర్శించారు. ఈ క్ర‌మంలోనే ఆమె అక్క‌డి పౌరుల‌ను త‌న సందేశం వినిపించ‌డానికి ఒక లేఖ రాసింది. అందులో ప్ర‌త్యేకం ఏముంటుంద‌నుకోకండి.. ఎందుకంటే అది సాధార‌ణ లెట‌ర్ కాదు... దానిని సిడ్నీలోని ఒక చారిత్రాత్మక భవనంలో భ‌ద్రంగా దాచిపెట్టారు. ఆ లేఖను 63 సంవ‌త్సరాలు దాటేంతవరకు తెరిచే అవ‌కాశంలేదు. ఎందుకంటే, బ్రిట‌న్ క్వీన్ ఎలిజ‌బెత్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 1986 లో అక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌న‌ సందేశం అందించ‌డానికి ఆ లేఖ‌ను రాసి అక్క‌డి అధికారుల‌కు ఇచ్చారు. అయితే, దీని గురించి త‌న వ్య‌క్తి గ‌త సిబ్బందికి కూడా తెలియ‌ద‌ని 7న్యూస్ నివేదించింది. సిడ్నీ న‌గరంలోని ఒక చారిత్రాత్మ‌క భ‌వ‌నంలోని ఒక సుర‌క్షిత‌మైన గాజు బాక్సులో దాచి పెట్టారు. దానిని 2085 తెరిచి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌న సందేశం అందించాల‌ని క్వీన్ ఎలిజ‌బెత్ లేఖ‌పై రాశారు.  

లార్డ్ మేయర్ ఆఫ్ సిడ్నీని ఉద్దేశించి, క్వీన్ ఎలిజ‌బెత్.. "క్రీ.శ. 2085లో మీరు ఎంపిక చేసుకునేందుకు తగిన రోజున, దయచేసి ఈ కవరు తెరిచి, సిడ్నీ పౌరులకు నా సందేశాన్ని తెలియజేస్తారా" అని పేర్కొంటూ..  ఇది కేవలం "ఎలిజబెత్ ఆర్" అని సంతకం చేయబడింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాబట్టి దానిని తెరవడానికి మరో 63 సంవత్సరాలు కావాలి. కాగా, త‌న జీవితకాలంలో క్వీన్ ఎలిజబెత్ II 16 సార్లు ఆస్ట్రేలియాను సందర్శించారు. కాగా, 1999లో, ఆస్ట్రేలియా దేశాధినేతగా రాణిని తొలగించాలా వద్దా అనే దానిపై రిఫరెండం నిర్వహించింది.. అయితే, అక్క‌డి ప్ర‌జ‌లు రాణికి అనుకూలంగా ఓటు వేయ‌డంతో ప్ర‌జాస్వామ్య యుతంగా రాజ‌కుటుంబ పాల‌న కొన‌సాగుతోంది. ఆమె మ‌ర‌ణంపై స్పందించిన ఆస్ట్రేలియా స‌ర్కారు..  సిడ్నీ ఐకానిక్ ఒపెరా హౌస్ నుంచి  శుక్రవారం నాడు  రాణికి నివాళులర్పించింది. పొరుగున ఉన్న కామన్వెల్త్ దేశం న్యూజిలాండ్ ఆదివారం ఒక టెలివిజన్ వేడుకలో కింగ్ చార్లెస్ IIIని తన దేశాధినేతగా అధికారికంగా ప్రకటించిందని CNN నివేదిక తెలిపింది. కాగా, క్వీన్ ఎలిజ‌బెత్ 2 అంతిమయాత్రకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios