Russia Ukraine Crisis: ఉక్రెయిన్-ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యా మ‌రింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. చాలా దేశాలు రష్యాపై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ఖ్యాత క్రీడా స‌మాఖ్య వరల్డ్ టైక్వాండో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అందించిన‌ గౌరవ టైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను తొలగించింది.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. సోమ‌వారం ఇరు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. ర‌ష్యా మ‌రింత దూకుడును ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. దీంతో చాలా దేశాలు ర‌ష్యా తీరును ఖండిస్తూ.. అధ్య‌క్షుడు పుతిన్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉక్రెయిన్‌పై దాడికి పాల్పడినందుకు ప్ర‌ఖ్యాత క్రీడా స‌మాఖ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు అందించిన‌ గౌరవ టైక్వాండో బ్లాక్ బెల్ట్‌ను తొలగించింది. ఈ విషయాన్ని వరల్డ్ టైక్వాండో ట్విటర్‌లో వెల్లడించింది.

"విజయం కంటే శాంతి అత్యంత విలువైనది" అనే ప్రపంచ టైక్వాండో భావిస్తుంది. వ‌ర‌ల్డ్ టైక్వాండ్ విలువలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లో అమాయకుల జీవితాలపై జరిగిన క్రూరమైన దాడులను ప్రపంచ టైక్వాండో తీవ్రంగా ఖండిస్తున్నట్లు క్రీడల పాలకమండలి ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని ఖండించిన వ‌ర‌ల్డ్ టైక్వాండ్.. "ఈ విషయంలో, నవంబర్ 2013లో ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రదానం చేసిన గౌరవ 9వ డాన్ బ్లాక్ బెల్ట్‌ను ఉపసంహరించుకోవాలని వరల్డ్ టైక్వాండో నిర్ణయించింది" అని పేర్కొంది. అలాగే, ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ, రష్యా మరియు బెలారస్‌లో టైక్వాండో ఈవెంట్‌లను నిర్వహించడం లేదా గుర్తించడం లేదని వరల్డ్ టైక్వాండో వెల్ల‌డించింది.

Scroll to load tweet…

వరల్డ్ టైక్వాండో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని మెజారిటీ వ‌ర్గాలు స్వాగ‌తిస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు, క్రీడాకారులు దీనిని స్వాగ‌తించారు. "ధన్యవాదాలు. ఒక అభ్యాసకుడిగా నేను చాలా ఆందోళన చెందాను" అని ట్విట్టర్ వినియోగదారు లెస్లీ కార్హార్ట్ పోస్ట్ చేశారు. "ఆ బలమైన ప్రకటనకు ధన్యవాదాలు. తైక్వాండో ప్రపంచం ఇందులో మీ నాయకత్వాన్ని అభినందిస్తుంది" అని మరొకరు పేర్కొన్నారు. 

ఫుట్‌బాల్ సంస్థలు FIFA మరియు UEFA రష్యా జాతీయ జట్టు, క్లబ్‌లను పోటీల నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపిన అనంత‌రం వ‌ర‌ల్డ్ టైక్వాండ్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. "FIFA మరియు UEFA ఈ రోజు అన్ని రష్యన్ జట్లను, జాతీయ ప్రతినిధి జట్లు లేదా క్లబ్ జట్లు అయినా, తదుపరి నోటీసు వచ్చేవరకు FIFA మరియు UEFA పోటీలలో పాల్గొనకుండా సస్పెండ్ చేయాలని నిర్ణయించాయి" అని రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. అలాగే, ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీలు రెండూ ఉక్రెయిన్‌లో ప్రభావితమైన ప్రజలందరికీ పూర్తి సంఘీభావంతెలుపుతున్న‌ట్టుష ప్ర‌క‌టించాయి. కాగా, రష్యా ఫుట్‌బాల్ యూనియన్ సస్పెన్షన్‌ను ఖండించింది. ఈ చర్య వివక్షతో కూడుకున్నది అని పేర్కొంది.

Scroll to load tweet…