Asianet News TeluguAsianet News Telugu

ఆ రెండు ప్రాంతాల‌ను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తూ పుతిన్ కీల‌క నిర్ణయం.. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రష్యా తమ విలీనాన్ని ఖరారు చేసిన సందర్భంగా గురువారం ఆలస్యంగా ఉత్తర్వులు జారీ చేశారు.

Putin recognises independence of two Ukraine regions amid furor over annexation
Author
First Published Sep 30, 2022, 6:18 AM IST

రష్యా ఆక్రమిత ఉక్రేనియన్ ప్రాంతాలైన ఖెర్సన్, జపోరిజ్జియాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ రెండు ప్రాంతాల‌ను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ప్రాంతాలు అధికారికంగా రష్యాలో విలీనం కావడానికి ముందు .. గురువారం  పుతిన్ ఉత్తర్వులు జారీ చేశారు.

దక్షిణ ఉక్రెయిన్‌లో ఉన్న జాపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల సార్వభౌమాధికారం,  స్వాతంత్రాల‌ గుర్తింపునకు ఆదేశించిన‌ట్టు పుతిన్ ప్ర‌క‌టించారు. అంతర్జాతీయ చట్టాల సూత్రాలు, నిబంధనలకు అనుగుణంగా.. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పొందుపరచబడిన ప్రజల సమానత్వం, స్వీయ-నిర్ణయం యొక్క సూత్రాన్ని గుర్తించడం, నిర్ధారించడం ఆధారంగా.. ఖెర్సన్ ప్రాంతంలోని ప్రజల ఇష్టాన్ని పరిగణనలోకి తీసుకోవడం జ‌రిగిందని తెలిపారు. సెప్టెంబర్ 27 న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ప్ర‌కారం ఖేర్సన్ ప్రాంతం యొక్క సార్వభౌమత్వాన్ని, స్వాతంత్రాన్ని గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న‌ట్టు తెలిపారు. 

అంత‌కుముందు.. దక్షిణ, తూర్పు ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాల విలీనానికి తమకు పూర్తి మద్దతు ఉందని రష్యా పేర్కొంది. జాపోరిజ్జియా , ఖెర్సన్, లుహాన్స్క్, డొనెట్స్క్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన భూభాగాలు శుక్రవారం దేశంలో చేర్చబడతాయి. జాపోరిజ్జియా ప్రాంతంలో 93%, ఖెర్సన్ ప్రాంతంలో 87%, లుహాన్స్క్ ప్రాంతంలో 98% , డొనెట్స్క్‌లో 99% బ్యాలెట్‌లు మద్దతు ఇచ్చాయని ర‌ష్యా నివేదించింది. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రావిన్సులను అధికారికంగా కలుపుకుంటామని రష్యా చెప్పింది.

 

రష్యా ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) స్వీకరించిన తరువాత.. ఉక్రెయిన్‌లోని మరో నాలుగు ప్రాంతాలు అధికారికంగా దాని సరిహద్దులో చేర్చబడతాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేయనున్నారు.

క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి ఎస్. పెస్కోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలను రష్యాతో విలీనం చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ నగరాల అధిపతులు క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో అవసరమైన పత్రాలపై సంతకం చేయనున్నారు. 

అయితే.. రెఫరెండం పేరుతో ఈ విలీనానికి ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అమెరికా, పాశ్చాత్య దేశాల అభ్యంతరాలను రష్యా తోసిపుచ్చింది. ఐదు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించామని  రష్యా చెప్పింది.  ఇందులో లభించిన మద్దతు ఆధారంగా ఉక్రెయిన్‌కు చెందిన డొనెట్స్క్, లుహాన్స్క్, జపోర్జియా, ఖెర్సన్‌లను రష్యాలో విలీనం చేయనున్నట్టు,  ఇందుకోసం చట్టబద్ధంగా ఓటింగ్ జరిపినట్టు తెలిపింది. 

ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలను రష్యాలో విలీనం చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. మాస్కో స్క్వేర్‌లో ఈ కార్యక్రమానికి వేదికను సిద్ధం చేశారు. హోర్డింగ్‌లు, పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు  చేశారు.
ఉక్రెయిన్‌లోని నాలుగు నగరాలు రష్యాలో విలీనమైన సందర్భాన్ని ప్రత్యేక రోజులా జరుపుకోవడానికి రష్యా సిద్ధమవుతోంది. రష్యా జాతీయ మీడియా శుక్రవారం నాటి కార్యక్రమాన్ని రెఫరెండం అందుకున్న వేడుకగా ప్రదర్శిస్తోంది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. ఇందుకోసం మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్‌లు, పెద్ద వీడియో స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ప్రదర్శించే ప్రత్యేక ప్రదర్శనను కూడా సిద్ధం చేశారు.
 
గతంలో కూడా ఇలానే...

2008లో జార్జియాతో యుద్ధం తర్వాత.. రష్యా రెండు వేర్వేరు జార్జియా భూభాగాలను, అబ్ఖాజియా,  దక్షిణ ఒస్సేటియాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించింది. రష్యా కూడా ఈ రెండు భూభాగాలకు చాలా నిధులు సమకూర్చింది. దీని తరువాత.. ఇక్కడి ప్రజలకు రష్యా పౌరసత్వం ఇవ్వబడింది మరియు యువతను రష్యన్ సైన్యంలోకి చేర్చారు. అలాగే.. 2014లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది.  అలాగే.. 22 ఫిబ్రవరి 2022న,  దొనేత్సక్, లుహాన్స్క్‌లను రష్యా స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించింది. ఈ రెండు ప్రాంతాలను డాన్‌బాస్ అని పిలుస్తారు. రష్యా ఈ ప్రకటన చేసిన రెండు రోజుల తరువాత, రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది, అది ఇప్పటికీ కొనసాగుతోంది.

రష్యా చర్యకు వ్యతిరేకత

రష్యా చర్యను చాలా దేశాలు ఖండించాయి. కైవ్ దాని ప్రజలను దానికి దూరంగా ఉండాలని కోరింది. రష్యా చర్యపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసింది. జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బెర్బాక్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం.. ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణను తుపాకీతో స్వీకరించారు, ఇది స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలకు విరుద్ధమనీ, రష్యా అశాంతిని  సృష్టించిందని విమర్శించారు.

 క్రెమ్లిన్ ప్రకటనలను పట్టించుకోకుండా ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. రాబోయే రోజుల్లో రష్యా ఆక్రమణ నుండి తమ ఈశాన్య ప్రాంతాలను విముక్తి చేస్తామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. డోంట్స్క్ ,  లుహాన్స్క్ విముక్తి చర్చ ఉక్రేనియన్ సైన్యం ద్వారా జరుగుతోందని తెలిాపింది.

Follow Us:
Download App:
  • android
  • ios