అమెరికాలో పంజాబ్‌ యువకుడిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్‌ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ సంఘటన జార్జియాలో చోటు చేసుకుంది. 

అమెరికాలో భారతీయులపై కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. పట్టపగలు దోపిడీకి పాల్పడిన దుండ‌గుడు ఓ భారతీయ యువ‌కుడిని కాల్చి చంపబడ్డాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న పంజాబ్‌ యువకుడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ సంఘటన జార్జియాలో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా ధాపై గ్రామానికి చెందిన పరమ్‌వీర్ సింగ్‌ అమెరికాలోని జార్జియాలో గ్రోసరీ షాపు నిర్వహిస్తున్నాడు.

షాపులోకి చొర‌బ‌డిన వ్య‌క్తి తొలుత డ‌బ్బులు దౌర్జ‌న్యంగా లాక్కుని షాప్ నిర్వాహ‌కుడిని కాల్చి చంపారు. మృతుడు కపుర్తలా జిల్లా ధపై గ్రామానికి చెందిన పరమవీర్ సింగ్‌గా గుర్తించారు. హృదయ విదారకమైన ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నిందితుడు ఆఫ్రికా దేశస్థుడని తెలుస్తోంది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఆ వీడియోలో షాప్ లోపల కౌంట‌ర్ వ‌ద్ద‌ పరమవీర్ సింగ్ ఉండ‌గా.. స‌డెన్ గా ఓ దుండ‌గుడు షాప్ లోకి ప్రవేశించి.. పరమవీర్ సింగ్‌పై పిస్టల్ గురిపెట్టాడు. చంపేస్తానని బెదిరించిన‌ట్టు.. ఆ దుండ‌గుడు అడిగినంత సింగ్ ఇస్తున్నట్లు, కానీ, ఆ దుండ‌గుడు షాప్ నుంచి పరార్ అయ్యే ముందు పరమవీర్ సింగ్‌ను కాల్చిన‌ట్టు వీడియోలో చూడవచ్చు. ఈ కాల్పుల్లో పరంజిత్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. 

ఈ సంఘటనపై స్పందించిన అమెరికా పోలీసులు నిందితుడు క్రిస్ కోప్‌ల్యాండ్ (26)ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరమ్‌వీర్‌ సింగ్ మృతదేహాన్ని పంజాబ్‌లోని సొంత గ్రామమైన ధపై గ్రామానికి తీసుకువస్తున్నట్లు పరమవీర్ సింగ్ తండ్రి హర్దయాల్ సింగ్ విలేకరులకు తెలిపారు. సింగ్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. పరమ్‌వీర్‌ సింగ్‌ మరణాన్ని వారు తట్టుకోలేపోతున్నారు.

మరోవైపు ఆ గ్రోసరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘ‌టనకు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అమెరికాలో విద్వేష నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఆగస్టు 2021లో, జార్జియాలోనే బెగోవాల్ నివాసి కరణ్‌జిత్ సింగ్‌ను ఒక అమెరికన్ కాల్చి చంపాడు.