సంపద ఉండగానే సరిపోదు.. దాన్ని మెయింటెయిన్ చేయగలగాలి.. అనుభవించే అదృష్టం ఉండాలి. ముఖ్యంగా ఏ బ్యాంకు లాకర్ దాంట్లోనే పెడితే పాస్ వర్డ్స్ మరిచిపోకుండా ఉండాలి. లేకపోతే వేలకోట్ల డబ్బున్నా వేస్టే అవుతుంది. 

ప్రస్తుతం అలాంటి డైలమాలోనే ఉన్నాడు ఓ సాఫ్ట్ వేర్ ప్రోగామర్. ఏకంగా 1,753 కోట్ల డబ్బు ఇప్పుడు అతనికి అందుతుందో లేదో అనే ఉత్కంఠ నరాలు తెప్పేస్తుంది. 

వివరాల్లోకి వెడితే.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన స్టీఫెన్‌ థామస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ప్రొగ్రా మర్‌ క్రిప్టో కరెన్సీ విలువ తక్కువగా ఉన్నప్పుడు 7వేల 2బిట్‌కాయిన్లను కొనుగోలు చేశాడు. దీనిని ఎన్‌క్రిప్టెడ్‌ హార్డ్‌డ్రైవ్‌ అయిన ఐరన్‌ కీలోని ఓ ఖాతాలో భద్రపరిచి పాస్‌వర్డును పెట్టాడు. 

ప్రస్తుతం బిట్‌కాయిన్‌ విలువ భారీగా పెరుగడంతో ఆ మొత్తం సొమ్మును తీసుకోవాలనుకున్నాడు. అయితే 'ఐరన్‌ కీ'లోని ఖాతాకు పెట్టిన పాస్‌వర్డును మరిచిపోయాడు. ఖాతా తెరువాలంటే పది ప్రయత్నాల్లో సరైన పాస్‌వర్డును ఎంటర్‌చేయాలి. 

అయితే, థామస్‌ ఇప్పటికే 8సార్లు తప్పుడు పాస్‌వర్డులను ఎంటర్‌ చేశాడు. ఇక రెండు ప్రయత్నాల్లో సరైన పాస్‌వర్డు ఎంటర్‌ చేయకపోతే ఆ ఖాతా శాశ్వతంగా మూతబడుతుంది. అంటే 1,753 కోట్ల డబ్బు పోతుంది.