ఇజ్రాయిల్ కొత్త ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు బాధ్యతలు చేపట్టబోతున్నారు. సుమారు ఏడాది కాలం తరువాత తిరిగి ఆయన ఆ పదవిని అధిరోహించబోతున్నారు. ఆయన కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఎన్నికల్లో విజయం సాధించి ఇజ్రాయెల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న బెంజమిన్ నెతన్యాహును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. 73 ఏళ్ల నాయకుడు 2021లో మితవాద, ఉదారవాద, అరబ్ పార్టీల సంకీర్ణ కూటమి చేతిలో ఓడిపోయారు. తిరిగి ఏడాది తరువాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 

టెక్ దిగ్గజం విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియామకం.

ఐదోసారి ఇజ్రాయెల్ ప్రధాని పదవిని అధిరోహించబోతున్న బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘‘మజల్ తోవ్ నా స్నేహితుడు నెతన్యాహు. మీ ఎన్నికల విజయం భారతదేశం-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడంతో పాటు మన ఉమ్మడి ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తుందని నేను ఎదురు చూస్తున్నాను ’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తాత్కాలిక ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ కూడా తన ఓటమిని అంగీకరించారు. విజయం సాధించిన తన ప్రత్యర్థి నెతన్యాహును అభినందించారు. ‘‘ ఎన్నికలలో విజయం సాధించినందుకు ప్రతిపక్ష నాయకుడు నెతన్యాహును ప్రధాని లాపిడ్ అభినందించారు. వ్యవస్థీకృత అధికార మార్పిడిని సిద్ధం చేయాలని తన మొత్తం కార్యాలయాన్ని ఆదేశించారు. ’’ అని లాపిడ్ ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్‌పై పేటెంట్ రైట్స్ నమోదు

కాగా.. ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఓట్లను ఇంకా లెక్కించలేదు. అయితే నెతన్యాహు లికుడ్ పార్టీ, దాని మిత్రపక్షాలు 120 సీట్లలో 64 గెలుచుకుంటాయని అంచనా. పూర్తి ఫలితాలు అధికారికంగా విడుదల కావడానికి ముందు.. నెతన్యాహు లికుడ్ పార్టీ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. భారీ విజయం దిశగా దూసుకుపోతున్నామని చెప్పారు.

గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఆప్ దే విజ‌యం.. ఓటువేస్తే ఆయోధ్య‌కు తీసుకెళ్తాం: అర‌వింద్ కేజ్రీవాల్

కాగా.. బెంజమిన్ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో భారతదేశం-ఇజ్రాయెల్ 30 సంవత్సరాల పూర్తి దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నాయి. భారత్ తో ఎప్పుడూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను సమర్థించే నెతన్యాహు 2018 జనవరిలో మన దేశాన్ని సందర్శించారు. దాని కంటే ముందు అంటే 2017 జూలై లో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌లో తన చారిత్రాత్మక పర్యటన చేశారు. ఒక భారత ప్రధాని ఇజ్రాయిల్ లో పర్యటించడం అదే మొదటి సారి.