ఇజ్రాయెల్ కు అండగా నిలిచిన అమెరికా.. 8 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం..
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడటం.. దానికి ప్రతిదాడి ఇజ్రాయెల్ మొదలెట్టింది.
ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడటం.. దానికి ప్రతిదాడి ఇజ్రాయెల్ మొదలెట్టింది. ఈ క్రమంలో హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర పరిస్థితి ’’ని ప్రకటించింది.
ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ కు అండగా నిలిచారు. దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన ఇజ్రాయెల్‌కు అత్యవసర సైనిక సహాయ ప్యాకేజీని ఆమోదించారు.
హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయిల్‌పై భీకరంగా విరుచుకుపడ్డారు. గాజా నుంచి దాదాపు ఐదు వేల రాకెట్లు ప్రయోగించిన హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు మహ్మద్ దీఫ్ తెలిపారు. ఈ దాడిని ఆపరేషన్ ‘అల్-అక్సా ఫ్లడ్’ గా ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి 20 నిమిషాల్లో 5,000 క్షిపణులు, షెల్స్‌ను ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించినట్లు తెలిపారు.
మరోవైపు రాకెట్లతో హమాస్ మెరుపు దాడి చేయడంతో ఇజ్రాయిల్ కూడా అప్రమత్తమైంది. ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఎయిర్ ఢిఫెన్స్ ద్వారా హమాస్ క్షిపణులను ఎదుర్కొన్నది. ఈ తరుణంలో తాము కూడా పోరాటానికి సిద్దమేనని హమాస్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. హమాస్ మిలిటెంట్లు చొరబడిన సరిహద్దు ప్రాంతాల్లో ఐడీఎఫ్ దళాలను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్ సరిహద్దులోని 80 కిలోమీటర్ల పరిధిలో ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఇప్పటి వరకు జరిగిన హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడుల్లో వంద మంది పౌరులు మృతిచెందగా, 740ల మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో 198 మందికి పైగా పాలస్తియన్లు మరణించినట్లు ఆ దేశం ప్రకటించింది.