పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఓ పని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. బ్రెజిల్ కు చెందిన బికిని మోడల్ నటాలియా గరిబొట్టో ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు పోప్ ప్రాన్సిస్ లైక్ కొట్టడం గమనార్హం. దీంతో.. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బికిని మోడల్ నటాలియా స్కర్ట్ మీద ఉన్న ఫొటోను కొద్ది రోజుల క్రితం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు దాదాపు లక్షన్నర లైక్‌లు రాగా.. ఆ లైక్‌లలో పోప్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఖాతా(ఫ్రాన్సిస్కస్) నుంచి లైక్ రావడంతో.. ‘ఇలాగైనా కనీసం స్వర్గానికి వెళ్తాను’ అంటూ నటాలియా ట్విటర్‌లో సరదాగా పోస్ట్ పెట్టారు. 

ఇక విషయం తెలుసుకున్న పోప్ ఫ్రాన్సిస్ సిబ్బంది వెంటనే ఈ పోస్ట్‌ను అన్‌లైక్ చేశారు. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పోప్ ఫ్రాన్సిస్ వాడతారా లేక ఇతర సిబ్బంది వినియోగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా.. పోప్ ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 73 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మరోపక్క మోడల్ నటాలియా ఖాతాకు 23 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు.

ఈ లోపు నటాలియా మానేజ్‌మెంట్‌ కంపెనీ సీఓవై.కో ఈ విషయాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్‌ ఫ్రాన్సిస్‌ లైక్‌ చేసిన స్క్రీన్‌ షాట్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేసింది. ‘సీఓవై.కోకి పోప్‌ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్‌ క్వీన్‌ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్‌ షాట్‌ని షేర్‌ చేసింది. 

దాంతో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. అది కాస్తా ముదరడంతో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్‌ ఫోటోని లైక్‌ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, "హోలీ సీ నుంచి" లైక్‌ "వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం" అని తెలిపారు