Asianet News TeluguAsianet News Telugu

అమెరికా: పోలీసుల చేతుల్లో మరో నల్లజాతీయుడు బలి, చుట్టుముట్టి కాల్పులు

జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత కూడా అమెరికా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. 

Police shoot, kill Black man outside store in america
Author
America, First Published Aug 23, 2020, 6:13 PM IST

జార్జ్ ఫ్లాయిడ్ ఘటన తర్వాత కూడా అమెరికా పోలీసుల వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా మరో నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు.

వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి లూసియానాలోని లఫయెట్టే ప్రాంతంలో ఓ నల్ల జాతీయుడిని చుట్టుముట్టిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

దీనిపై పోలీసులు స్పందిస్తూ.. కత్తి ధరించిన ఆ వ్యక్తి తమ మాటల్ని లెక్కచేయకుండా ముందుకు వెళ్లడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. దీనిపై అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కత్తిని కలిగి వుంటే చంపేస్తారా అంటూ జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబం తరపున వాదిస్తున్న బెన్ క్రంప్ పోలీసులను ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయనే ట్విట్టర్‌లో షేర్ చేశారు. మృతుడిని ట్రేఫోర్డ్ పెల్లెరిన్‌గా గుర్తించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios