Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోదీ జపాన్ పర్యటన.. షింజో అబే అంత్యక్రియలకు హాజ‌రు

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు సోమ‌వారం జరుగ‌నున్నాయి. ఈ మేర‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేప‌థ్యంలో మోదీ సోమవారం జపాన్‌లోని టోక్యో వెళ్లారు.

PM Modi to attend Shinzo Abe's funeral  , meet counterpart Kishida
Author
First Published Sep 27, 2022, 4:37 AM IST

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు నేడు (సెప్టెంబర్ 27) జరగనున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  హాజరుకానున్నారు, ప్ర‌ధాని మోదీ తన స్నేహితుడికి చివరి వీడ్కోలు ప‌లుక‌నున్నారు. ఇందుకోసం ప్ర‌ధాని మోడీ సోమవారం జపాన్‌లోని టోక్యో వెళ్లారు. ఈ మేర‌కు  విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. 

'జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో బయలుదేరారు. సంతాపం ప్రకటించారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ.. అబే స్మృతికి నివాళులు అర్పించే అవకాశం. ఉంది అని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో 20కి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు సహా 100కు పైగా దేశాల ప్రతినిధులు  హాజరు కానున్నారు.

టోక్యోకు బయలుదేరే ముందు.. ప్రధాని మోదీ ఒక ట్వీట్‌లో చేస్తూ.. మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నేను ఈ రాత్రి టోక్యోను సందర్శిస్తున్నానని, భారతీయులందరి తరపున ప్రధానమంత్రి కిషిదా, శ్రీమతి అబేలకు క‌లిసి..  హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాన‌ని పేర్కొన్నారు.
 
అదే సమయంలో..  ప్రధాని మోడీ జపాన్ పర్యటన గురించి సమాచారం ఇస్తూ.. విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా ట్వీట్ చేశారు. ప్ర‌ధాని మోడీ జపాన్ పర్యటన సుమారు 12 నుండి 16 గంటల వ‌ర‌కు సాగ‌నున్న‌ది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ఆ దేశ ప్ర‌ధాని  ఫ్యూమియో కిషిదాతో సమావేశమవుతారని, ద్వైపాక్షిక సమావేశం కానున్నారని చెప్పారు. అలాగే.. ఈ పర్యటనలో ప్రధాని మోదీ శ్రీమతి అబేను కలుస్తారని ఆయన చెప్పారు.

అలాగే.. అబేతో ప్రధాని మోదీకి ఉన్న సన్నిహిత సంబంధాలను ప్రస్తావిస్తూ, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గౌరవార్థం భారతదేశం జాతీయ సంతాప దినాన్ని ప్రకటించిందని అన్నారు. అబే మృతికి సంతాపం తెలుపుతూ ప్ర‌ధాని మోదీ..  అబేను ప్రియమైన స్నేహితుడని అభివర్ణించారని, జపాన్ మాజీ ప్రధాని ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారని పేర్కొన్నారు. 

షింజో అబే హ‌త్య‌

షింజో అంబే జపాన్‌కు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి. ఆయ‌న జూలై 8న ఆ దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న క్ర‌మంలో కాల్చి చంపబడ్డాడు. 67 ఏళ్ల అంబేను దుండగుడు వెనుక నుంచి కాల్చాడు. అబేను విమానంలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని ఘటనా స్థలం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటైన జపాన్‌లో ఇలాంటి ఘటన జరగడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

టోక్యోలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు మంగళవారం టోక్యోలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అబే అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్ సహా పలువురు విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఎలాంటి భద్రతా లోపాలను నివారించడానికి పోలీసులు అదనపు నిఘా తీసుకుంటున్నారని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ జపాన్ వార్తా సంస్థ 'క్యోడో' తెలిపింది.

పోలీస్ మేజర్ రోడ్లు, J.R. టోక్యో స్టేషన్‌తో పాటు, జనం గుమికూడే ప్రదేశాలపై కూడా  ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తోంది. టోక్యోలోని నిప్పన్ బుడోకాన్ హాల్ సమీపంలోని పార్కులో అబే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు సాధారణ ప్రజల కోసం ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios