ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఇండోనేషియాలో భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు

ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఇండోనేషియాలో భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధ కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దుఃఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా నిలుస్తోంది.

Scroll to load tweet…

ఇండోనేషియాలోని జావాలో సంభవించిన భారీ భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఇండోనేషియాలోని జావాలో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం గురించి వినడం చాలా బాధాకరమని జైశంకర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో భారత్‌ ఇండోనేషియాకు అండగా నిలుస్తోందని అని పేర్కోన్నారు. 

ఇండోనేషియాలోని వెస్ట్ జావా ప్రావిన్స్ లో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరుకుంది. వంద‌లాది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఆగ్నేయంగా 75 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణానికి సమీపంలో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్లకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు.