Asianet News TeluguAsianet News Telugu

PM Modi in Japan: టోక్యోలో అడుగుపెట్టిన ప్ర‌ధాని మోదీ.. రెండు రోజుల‌పాటు ప‌ర్య‌ట‌న‌.. ప‌లువురితో భేటీ!

PM Modi in Japan: జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్‌ వెళ్లారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న టోక్యోలో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిద, స్కాట్‌ మారిసన్‌లతో సమావేశం కానున్నారు.  

PM Modi arrives in Japan on two-day visit to attend Quad summit, bilaterals
Author
Hyderabad, First Published May 23, 2022, 6:49 AM IST

PM Modi Japan tour: జపాన్ రాజధాని టోక్యో వేదికగా ఈనెల 24న జరగనున్న క్వాడ్​ దేశాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్‌ వెళ్లారు. సోమ‌వారం ఉద‌యం ఆయ‌న టోక్యోలో అడుగుపెట్టారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. క్వాడ్ లీడర్‌లను కలవడం, జపాన్ వ్యాపారవేత్తలు, శక్తివంతమైన భారతీయ ప్రవాసులతో భేటీ కావ‌డం వంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొన‌నున్నారు.  జపాన్‌ ప్రధాని కిషిద ఆహ్వానం మేరకు మోడీ టోక్యో వెళ్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 

ఆదివారం రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన ఆయన.. సోమవారం ఉదయం టోక్యోలో అడుగుపెట్టారు. ఈ మేరకు జపనీస్, ఇంగ్లిష్ భాషల్లో ఆయన ట్వీట్ చేశారు. ఆయనకు జపాన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. గత 8 ఏళ్లలో ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించడం ఇది ఐదోసారి అని MEA తెలిపింది.

క్వాడ్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్లొనేందుకు జపాన్‌ వెళ్లిన ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో పాటు వ్యాపారవేత్తలు, భారత సంతతికి చెందిన ప్రజలతోనూ సమావేశం కానున్నారు. దాదాపు 40 గంటల పాటు ప్ర‌ధాని మోడీ జపాన్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ సమయంలో దాదాపు 23 కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది. మోదీ ఒక రాత్రి టోక్యోలో, మరో రెండు రాత్రులు విమాన ప్రయాణంలో ఉంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.

భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటైన క్వాడ్‌ కూటమి  ఏర్పాటు అయ్యింది. హిందూ-పసిఫిక్‌ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛాయుత భాగస్వామ్యాలే లక్ష్యంగా చతుర్భుజ భద్రతా కూటమి(Quad)క్వాడ్ ఏర్పాటైంది. 

"ఓహాయో, టోక్యో! ప్ర‌ధాని మోదీ గత 8 ఏళ్లలో జపాన్‌లో ఐదు సారి పర్యటిస్తున్న‌ సందర్భంగా ప్రధాని @నరేంద్రమోదీకి టోక్యో ఘన స్వాగతం పలికింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. మే 24న టోక్యోలో జరిగే క్వాడ్ సమ్మిట్‌కు ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్ హాజరవుతారు.

ఈ స‌మ్మిట్ లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాల మ‌ధ్య పరస్పర ప్రయోజనాలను, ప్రపంచ సమస్యల గురించి, ఇత‌ర దేశాల‌ అభిప్రాయాలను పరస్పరం పంచుకోవ‌డాని ఈ స‌ద‌స్సు వేదిక‌. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేప‌థ్యంలో  జపాన్ పర్యటన జరుగుతున్నదని ప్రధాని మోడీ అన్నారు. టోక్యోలో జరిగే క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోను సందర్శించిన ప్రధాని మోదీ, శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బిడెన్, కిషిదా, అల్బనీస్‌లతో వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.  టోక్యోలో  పర్యటన సందర్భంగా.. భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో  చ‌ర్య‌లు జరుగుతాయ‌న‌ ఎదురుచూస్తున్నానని  ప్రధాని మోదీ తన పర్యటనకు ముందు చెప్పారు.

కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని, ఈ సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరుదేశాల మధ్య బహుముఖ సహకారం, పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. జపాన్  దాదాపు 40,000 మంది భారతీయ ప్రవాస సభ్యులకు జపాన్ లో ఉన్నార‌నీ,  వారితో సంభాషించడానికి తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios