PM Modi Egypt Visit: ఈజిప్టులో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కైరో చేరుకున్నారు. ఈ సమయంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసితో సహా ఈజిప్టు నాయకత్వంతో చర్చలు జరుపుతారు.
PM Modi Egypt Visit: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ నేడు ఈజిప్టు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కైరోలో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి ఆ దేశ ప్రధాని ముస్తఫా మద్‌బౌలీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలికి ‘గార్డ్ ఆఫ్ హానర్’ ఇచ్చారు. ఈ సమయంలొ ఓ ఈజిప్టు మహిళ యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటతో ప్రధానికి స్వాగతం పలికింది. ఇదిలా ఉండగా.. 1997 తర్వాత భారత ప్రధాని ఈజిప్ట్‌లో పర్యటించడంత ఇదే తొలిసారి. అంటే.. 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మోడీ
తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటన చేస్తున్నారు.
ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఈజిప్టు అధ్యక్షుడు ఎల్-సిసితో మోదీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసితో సహా ఈజిప్టు నాయకత్వంతో చర్చలు జరుపుతారు. భారత్‌పై దృష్టి సారించి తన మంత్రి మడ్‌బౌలీ నేతృత్వంలోని ఈజిప్టు మంత్రివర్గంతో మోదీ రౌండ్‌టేబుల్ చర్చలో పాల్గొంటారు.
అలాగే.. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దెల్-కరీం ఆలమ్‌తో ప్రధాని మోడీ నేడు సమావేశం కానున్నారు. అనంతరం ఈజిప్టు ప్రముఖ మేధావులతో చర్చలు జరుపుతారు. ఇదిలా ఉంటే.. దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో పునరుద్ధరించబడిన 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును కూడా మోదీ ఆదివారం సందర్శించనున్నారు.
ఈజిప్ట్ పర్యటన భాగంగా ప్రధాని మోదీ మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మారక స్థూపాన్ని కూడా సందర్శించనున్నారు. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్, పాలస్తీనాలో పనిచేసి మరణించిన భారతీయ సైన్యానికి చెందిన సుమారు 3,799 మంది సైనికుల జ్ఞాపకార్థం అంకితం చేయబడిన పవిత్ర స్థలం. ఇదొక స్మారక చిహ్నం.
ఇదిలా ఉంటే.. గణతంత్ర దినోత్సవానికి ఈజిప్ట్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రెసిడెంట్ అల్-సిసి భారతదేశాన్ని సందర్శించారు. ప్రధాని ఈజిప్టు పర్యటనకు వెళ్లిన ఆరు నెలల వ్యవధిలోనే ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్నారు.ఈజిప్ట్ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించబడిన G-20 శిఖరాగ్ర సమావేశానికి ఎల్-సిసి సెప్టెంబర్‌లో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది.