తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి దూరం కావడాన్ని ఆ యువతి తట్టుకోలేకపోయింది. ఆ బాధ మర్చిపోవడానికి పీకలదాకా మద్యం తాగేసింది. ఆ మద్యం మత్తులోనే విమానం ఎక్కిన ఆమె.. ఏం చేస్తుందో కూడా తెలియకుండా ప్రవర్తించింది. విమానంలో బీభత్సం సృష్టించింది. ఏకంగా విమానం అద్దాన్నే పగలకొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.  ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాకు చెందిన 29ఏళ్ల యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే.. ఆ వ్యక్తి గత కొంతకాలంగా యువతిని దూరం పెట్టసాగాడు. దీనిని తట్టుకోలేకపోయిన సదరు యువతి గత నెలలో విమానంలో ప్రయాణిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. 

ఈ క్రమంలోనే పీకలదాకా తాగేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది. ఆ మత్తులో విమానం కిటీకీ అద్దాన్ని చేతితో పగలకొట్టింది. దీంతో ఒక్కసారిగా విమానంలోని ప్రయాణికులంతా భయందోళనలకు గురయ్యారు. సదరు యువతి ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఆమె ఎవరి మాట వినలేదు.

ఈ నేపథ్యంలో పైలెట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో ఆమె పరిమితికి మించి మద్యం సేవించినట్లు గుర్తించారు.