Asianet News TeluguAsianet News Telugu

కుప్పకూలిన విమానం.. పైలట్ లతో సహా ఆరుగురు మృతి..

కొలంబియాలో విమాన ప్రమాదం జరిగింది. సెంట్రల్ కొలంబియా ప్లేన్ క్రాష్ కొలంబియాలో బుధవారం ఒక చిన్న విమానం ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఐదుగురు రాజకీయ నాయకులు, ఓ పైలట్ మృతి చెందారు.

Plane Crash In Colombia 5 Politicians, Pilot Die In KRJ
Author
First Published Jul 20, 2023, 5:53 AM IST

కొలంబియాలో విమాన ప్రమాదం జరిగింది. సెంట్రల్ కొలంబియాలో బుధవారం చిన్న విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఐదుగురు రాజకీయ నాయకులు, ఓ పైలట్ మృతి చెందారు.  విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబ్ యొక్క మితవాద సెంట్రో డెమోక్రాటికో పార్టీ సభ్యులు అని సమాచారం. పౌర విమానయాన అథారిటీ ప్రకారం.. బోయాకా డిపార్ట్‌మెంట్‌లోని శాన్ లూయిస్ డి గెసానో మునిసిపల్ ప్రాంతంలో విమానం కుప్పకూలింది.

అదే సమయంలో.. ఈ సంఘటనపై పార్టీ ట్వీట్ ద్వారా విచారం వ్యక్తం చేసింది. విమాన ప్రమాదంలో మరణించిన వారిలో మాజీ సెనేటర్లు నోహోరా తోవర్, డిమాస్ బారెరో, ఎలియోడోరో అల్వారెజ్, విల్లావిసెన్సియో మున్సిపల్ కౌన్సిలర్ ఆస్కార్ రోడ్రిగ్జ్ ఉన్నారు. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక మీడియా ప్రకారం.. విమానం విల్లావిసెన్సియో నుండి బొగోటాకు బయలుదేరింది. అందరూ పార్టీ ఫంక్షన్‌కి వెళ్తున్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా విచారం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios