భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వివరాలు ఇవే..
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతుంది. ఈరోజు భౌతికశాస్త్రం విభాగంలో నోబెల్ అవార్డు 2023ను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతుంది. ఈరోజు భౌతికశాస్త్రం విభాగంలో నోబెల్ అవార్డు 2023ను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. అణువుల్లో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం.. కాంతి అటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు శాస్త్రవేత్తలు పియరీ అగోస్టిని, ఫెరెన్క్ క్రాస్జ్, అన్నే ఎల్'హుల్లియర్‌లకు నోబెల్ ప్రకటించారు. ఈ ఏడాది నోబల్ అవార్డు గెలుచుకున్న వీరికి.. 11 మిలియన్ స్వీడిష్ కిరీటాలకు (సుమారు $1 మిలియన్) పెంచబడిన బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేయనుంది.
అక్టోబరు ప్రారంభంలో వరుసగా వారం రోజుల పాటు నోబల్ అవార్డుల ప్రకటన జరుగుతుంది. ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారం మొదలైంది. నిన్న వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. ఇక, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 9న అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు.
ఇక, నోబెల్ ప్రైజ్ మనీ విషయానికి వస్తే.. 2012లో ప్రైజ్ మనీని 10 మిలియన్ క్రౌన్స్ నుంచి 8 మిలియన్ క్రౌన్స్‌కు తగ్గించారు. 2017లో తిరిగి 9 మిలియన్ క్రౌన్స్, 2020లో 10 మిలియన్ క్రౌన్స్‌కు పెంచారు. ఇప్పుడు 11 మిలియన్లకు పెంచారు.