హాంగ్ కాంగ్: ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ పాకినట్లు నిర్ధారణ అయింది. ఈ సంఘటన హాంగ్ కాంగ్ లో వెలుగు చూసింది. మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి ఘటన బహుశా ఇదే. 

60 ఏళ్ల వృద్ధురాలికి చెందన శునకానికి పలుమార్లు పరీక్షలు నిర్వహించారు. దాంతో దాన్ని పశు కేంద్రానికి తీసుకుని వెళ్లారు. అయితే, పరీక్షల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించినట్లు చెబుతున్నారు. 

Also Read: కరోనా వైరస్: బ్రహ్మం గారితోపాటు వీరూ ముందే చెప్పారు!

శునకానికి నిర్వహించిన వరుస పరీక్షల్లో లో లెవల్ ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు తేలిందని హాంగ్ కాంగ్ వ్యవసాయ, మత్స్య, సంరక్షణ శాఖ తెలిపింది. దాంతో మనిషి నుంచి కరోనా వైరస్ శునకానికి పాకిందని విశ్వవిద్యాలయాలు, ప్రపంచ పశు ఆరోగ్య సంస్థ నిపుణులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పింది. 

కుక్కకు కొత్త సింప్టమ్స్ ఏవీ కనిపించలేదని అంటున్నారు. కరోనావైరస్ సోకిన జంతువులను ఐసోలేషన్ లో పెట్టాలని హాంగ్ కాంగ్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాంతో రెండు శునకాలను ఐసోలేషన్ లో పెట్టారు. హాంగ్ కాంగ్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 104కు చేరుకుంది.

Also Read: దేశంలో 29 కరోనా కేసులు, యుద్దప్రాతిపదికన చర్యలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్