Asianet News Telugu

కరోనా వైరస్: బ్రహ్మం గారితోపాటు వీరూ ముందే చెప్పారు!

తాజాగా ఢిల్లీలో ఒక కేసు, హైదరాబాద్ లో కూడా మరో కేసు తాజాగా నమోదవడంతో ఇప్పుడు దేశం మొత్తంలో ఈ వైరస్ పట్ల భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా మంది ఈ మహమ్మారిని గతంలోనే ఊహించారని చెబుతూ అనేక పోస్టులు పెడుతున్నారు.

Corona Virus: the complete list of persons, books, movies who predicted corona virus long before
Author
Hyderabad, First Published Mar 5, 2020, 11:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరోనా వైరస్... ఇప్పుడు ఈ పేరు చెబితేనే ప్రపంచమంతా వణికి పోతుంది. పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని వణికిస్తోంది ఈ వ్యాధి. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా గట్టి చర్యలని తీసుకుంటుంది. 

తాజాగా ఢిల్లీలో ఒక కేసు, హైదరాబాద్ లో కూడా మరో కేసు తాజాగా నమోదవడంతో ఇప్పుడు దేశం మొత్తంలో ఈ వైరస్ పట్ల భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా మంది ఈ మహమ్మారిని గతంలోనే ఊహించారని చెబుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. అవి ఏమిటో మీరు కూడా ఒక లుక్కేయండి. 

1. బ్రహ్మం గారు 

కరోనా వైరస్ ఇంతలా ప్రపంచాన్ని వణికిస్తున్నవేళ.... దీన్ని చాలా కాలం కిందటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం గా బాగా ప్రాచుర్యం పొందిన భవిష్య వాణిలో ఆయన పేర్కొన్నారని ఒక పద్యం చక్కర్లు కొడుతుంది. 

ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, 

లక్షలాది మంది ప్రజలు సచ్చేరయ 

కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి

కోడిలాగా తూగి సచ్చేరయ 

ఈ పద్యం సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతుంది. దాదాపుగా ఒక 4వందల సంవత్సరాల కిందనే బ్రహ్మం గారు జోస్యం చెప్పారని సోషల్ మీడియాలో ఆయన కాలజ్ఞానంపై చర్చ మొదలయింది. 

ఈశాన్యంలో విషగాలి పుట్టి లక్షలాది మంది చనిపోతారని, ఆయన దానికి అప్పట్లోనే కోరంకి అని పేరు పెట్టడం ఇక్కడ మరో ఎత్తు అని సోషల్ మీడియాలో ఈ పద్యం బాగా వైరల్ అయింది. 

పనిలోపనిగా ఆయన గతంలో చెప్పిన కాలజ్ఞానంలో నిజమైన అంశాలను గురించి కూడా చర్చ మొదలుపెట్టారు. ఇందిరా గాంధీ ప్రధాని అవ్వడం నుండి నేపాల్ భూకంపం వరకు అనేక విషయాలను వారు అక్కడ ప్రస్తావిస్తున్నారు. 

 

2. సిల్వియా బ్రౌన్ ...ఎండ్ అఫ్ ది డేస్ 

అమెరికన్ రచయిత్రి సిల్వియా బ్రౌన్ 2008లోనే ఇలాంటి ఒక వైరస్ ప్రపంచాన్ని 2020లో కుదిపేస్తుందని చెప్పింది. ఈవిడకు కొన్ని సూపర్ నాచురల్ పవర్స్ ఉన్నాయనే ప్రచారం కూడా తోడవడంతో ఆమె రాసిన ఆ పుస్తకంలోని అంశాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

న్యుమోనియా లాంటి వ్యాధి వాళ్ళ ఊపిరితిత్తులకు సంబంధించిన నాళాలు చిట్లి అనేక మంది మరణిస్తారని పేర్కొన్న ఈవిడ... ఇది ఎలా ఎంత త్వరగా వస్తుందో, అంతే త్వరగా వెళ్ళిపోతుందని, మళ్ళీ 10 సంవత్సరాల తరువాత మరో సారి తిరిగి వచ్చి ఆ తరువాత పూర్తిగా మాయమైపోతుందని ఆమె ఆ పుస్తకంలో తెలిపింది. 

3. ఫార్చ్యూన్ టెల్లర్ సింప్ సన్స్... 

నిర్విరామంగా నడుస్తున్న కామెడీ ఆనిమేటెడ్ సిరీస్ సింప్సన్స్ లో కూడా దీనికి సంబంధించిన ఒక ప్రతీకాత్మత ఉంది. ఇప్పటివరకు 11 సార్లు ఈ సిరీస్ చెప్పిన విషయాలు వాస్తవాలయ్యాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవుతాడని కూడా ఈ సిరీస్ తెలిపింది. 

1993లో సీజన్ 4లో 23వ ఎపిసోడ్ లో జపాన్, చాలా నుంచి వచ్చిన ఒక వైరస్ ను ఒక నౌక ద్వారా స్ప్రింగ్ ఫీల్డ్ కి తీసుకొచ్చినట్టు చూపెడుతున్నారు. ఇప్పుడు ఆ అంశాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుస్తున్నారు. ఇకపోతే ట్విట్టర్లో చాలా మంది వెనుకాల కరోనా వైరస్ అని ఉన్న ఒక బొమ్మను షేర్ చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ హౌస్ క్యాట్ ఫ్లూ ఉండేదని కొందరు వాదిస్తున్నారు. మొత్తానికి మాత్రం సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ గా మారింది. 

4. అయిస్ అఫ్ డార్క్ నెస్ నవల 

1981లో సస్పెన్స్ థ్రిల్లర్ నవలలను రాసే రచయిత డీన్ కూన్ట్జ్ రాసిన అయిస్ అఫ్ డార్క్ నెస్ లో ఆయన వుహాన్ 400గా చెప్పబడే వైరస్ ఒకదాన్ని ల్యాబులో తాయారు చేస్తారని, వాస్తవానికి దాన్ని ఒక జీవాయుధంగా వాడడానికి తాయారు చేసారని పేర్కొన్నాడు.

ఒక్కసారిగా ఇప్పుడు ఆ వైరస్ చైనాలోని వుహాన్ నగరం నుంచే పుట్టడంతో దానికి కూడా ఈ థియరీని అంటగట్టి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. 

5. 2011 కంటాజియన్ మూవీ 

2011లో వచ్చిన ఈ సినిమాలో కూడా ఒక వైరస్ ఇలానే చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపిస్తుందని చెప్పడం జరిగింది. ఆ మూవీలో సైతం చివరకు ఈ వైరస్ కి కారణం గబ్బిలాలుగా తేలుస్తారు. ఇప్పుడు ఈ వైరస్ కి కూడా కారణం గబ్బిలాలు అనే ఒక అంచనా కూడా ఉండడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. 

గమనిక: ఇవన్నీ యాదృచ్చికంగా అయ్యాయి తప్ప వీటివల్ల ప్రజల్లో భయాందోళనలు కలిగించడం మా ఉద్దేశం కాదు. కరోనా వైరస్ పట్ల అపోహలను నమ్మకండి, భయాందోళనలు చెందకండి. కానీ జాగ్రత్తగా మాత్రం ఉండండి.  

Follow Us:
Download App:
  • android
  • ios