పాకిస్థాన్ లో ఉదయం బాంబుల మోత మోగింది. ఇద్దరు వ్యక్తులు పారామిలిటరీ హెడ్ క్వార్టర్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఇంకా ఉగ్రదాడులు కొనసాాగుతున్నట్లు సమాచారం.
Pakistan Bomb Blast : పాకిస్థాన్‌లో పారామిలటరీ హెడ్‌క్వార్టర్స్‌పై దుండగులు దాడి చేశారు. వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్‌లో సోమవారం ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చనిపోయినట్లు రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
ఇద్దరు ఉగ్రవాదుల ఆత్మాహుతి
మొదటి ఆత్మాహుతి బాంబర్ హెడ్‌క్వార్టర్స్ గేటు దగ్గర, రెండో వ్యక్తి కాంపౌండ్‌లో దాడి చేసినట్టు రిపోర్ట్ వివరిస్తోంది. పోలీసులు, సైన్యం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. హెడ్‌క్వార్టర్స్ లోపల ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానిస్తున్నారు.
పెషావర్ లో ఉద్రిక్తత
దాడి జరిగిన పారామిలటరీ హెడ్‌క్వార్టర్స్ సైనిక కంటోన్మెంట్ దగ్గరే ఉంది. ఆ ప్రాంతంలో చాలా మంది నివసిస్తున్నారు. అక్కడి రోడ్లను మూసివేసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్నారు.


