Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో ఊడుతున్న ఉద్యోగాలు.. హెచ్1బీ వీసా భారతీయులకు సాయం చేయడంపై యూఎస్ దృష్టి

Layoffs 2022: అమెరికాలో హెచ్1బీ వీసాలు ఉన్న భారతీయులు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కష్టపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వలసదారులకు సహాయం చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నట్లు అమెరికా తెలిపింది. 
 

Layoffs 2022:Blowing jobs in America.. US focus on helping H1B visa Indians
Author
First Published Nov 24, 2022, 11:59 PM IST

H1B Visa-Layoffs 2022: అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. దీంతో అక్క‌డున్న విదేశీ పౌరుల క‌ష్టాలు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో అత్య‌ధికం H1B Visa వారే ఉంటున్నార‌నీ, వారికి సాయం చేయ‌డానికి అమెరికా త‌మ వ‌ద్ద ఉన్న అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అనేక దేశాల పౌరుల‌తో పాటు భార‌తీయులు కూడా ఇందులో ఉన్నారు. ప్ర‌స్తుతం అనేక టెక్ కంపెనీలు పెద్ద సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. దీని కారణంగా లింక్డ్ఇన్ లో చాలా మంది ఉద్యోగ అప్పీళ్ల కోసం పోస్ట్ చేస్తున్నందున.. సంబంధిత పోస్టులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఉద్యోగాల నుంచి తొలగించబడిన ప్రతి ఒక్కరూ కొత్త ఉద్యోగాన్ని గుర్తించ‌డం.. దానిని పొందడం మ‌రింత కష్టంగా ఉంద‌నీ, వారు ప్ర‌స్తుతం తాత్కాలిక‌ హెచ్1బీ వీసాల‌పై ఉన్నార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

బ్లూమ్ బెర్గ్ తాజా నివేదిక ప్ర‌కారం.. అమెరికాలో వేలాది మంది వ‌ల‌స‌దారులు ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు. వారిని తొలగించిన సంస్థల నుండి దీనికి సంబంధించి వారికి సరైన మార్గదర్శకత్వం లభించడం లేదు. అమెజాన్, మెటా, స్ట్రైప్, ట్విట్టర్, సేల్స్ఫోర్స్ వంటి సంస్థలు గత మూడు సంవత్సరాలలో దాదాపు 45,000 హెచ్1బీ వీసా హోల్డర్లను స్పాన్సర్ చేశాయి, కానీ తొల‌గించిన ఉద్యోగులకు ఇప్పుడు తగినంత మద్దతు లభించడం లేదు. దీంతో వారు కొత్త ఉద్యోగం పొంద‌డం కోసం తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 

హెచ్1బీ వీసా హోల్డర్లు లేదా యూఎస్ లో ఉద్యోగం పొందిన వలసదారులు.. వారు ఉద్యోగం కోల్పోతే 60 రోజులకు మించి దేశంలో ఉండటానికి అనుమతించబడరని అధికారికి నిబంధ‌న‌లు చెబుతున్నాయి. హెచ్1బీ వీసా కార్మికులు సుమారు 60 రోజుల్లో కొత్త ఉద్యోగాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఒక‌వేళ ఉద్యోగం దొర‌క్క‌పోతే వారు దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుంది. వీసాలు సాధారణంగా మూడు సంవత్సరాల పాటు జారీ చేయబడతాయి. ఉపాధిని బట్టి వాటిని పొడిగించవచ్చు. ట్విట్టర్, ఫేస్ బుక్  మాతృసంస్థ మెటాలో తాజా తొల‌గింపుల కార‌ణంగా దాదాపు 350 మంది వలసదారులు ప్రభావితమయ్యారని నివేదిక పేర్కొంది. ఇటీ బాట‌లోనే అనేక టెక్ కంపెనీలు ఉద్యోగుల‌ను తొలగిస్తున్నందున ప్రజలు మంచి ఉద్యోగాలను కనుగొనడానికి కష్టపడుతున్నారు. వాటిలో చాలా వరకు రాబోయే నెలల కోసం నియామకాలను కూడా నిలిపివేశారు. లింక్డ్ఇన్, క్రౌడ్సోర్స్డ్ స్ప్రెడ్ షీట్లు వంటి ప్లాట్ ఫామ్ ల‌లో వేలాది జాబ్ పోస్ట్ అప్పీళ్లు, అలాగే వివిధ సోషల్ నెట్ వ‌ర్క్ ల‌లో రిఫరల్స్ క‌నిపిస్తున్నాయి.

తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై తొలగింపులు ప్రధాన ప్రభావాన్ని చూపాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మెటాలో చేరిన భారతదేశానికి చెందిన ఒక హెచ్ 1బి హోల్డర్, కొంతకాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నాడు. ఇంత పెద్ద టెక్ కంపెనీలలో ఉద్యోగం పొందడం అంత సులభం కాదనీ, దాని కోసం సిద్ధం కావడానికి నెలలు పడుతుందని ఆయన చెప్పారు. కాబట్టి, కేవలం 60 రోజుల్లో మ‌రో కొత్త ఉద్యోగం గుర్తించ‌డం, దానిని పొంద‌డం చాలా కష్టం, అది కూడా కంపెనీలు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను తగ్గించే సమయంలోన‌ని బ్లూమ్ బ‌ర్గ్ నివేదిక పేర్కొంది. "సరిగ్గా డాక్యుమెంట్ చేయబడిన 15 సంవత్సరాల తరువాత కూడా మీకు ఉండటానికి ఒక మార్గం లేదని మీకు మీరు చెప్పుకోవడం కష్టం. నివాసానికి మార్గం ఛిన్నాభిన్నమైంది" అని ఆదిత్యా తావ్డే చెప్పారు. ఇప్పుడు చాలా మంది హెచ్1బీ హోల్డర్లు పరిమిత కాలంలో ఉద్యోగం కోసం వెతకడం కష్టంగా ఉన్నందున, యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) ఏజెన్సీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. "వలస సమాజాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి విధాన ఎంపికలను అన్వేషిస్తున్నాం.. ఇదే స‌మ‌యంలో వారి ప్రయోజనాలకు ప్రాప్యతను పెంచడానికి కట్టుబడి ఉన్నాము" అని ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios