Asianet News TeluguAsianet News Telugu

‘హేయ్ అలెక్సా..’ వేధింపులు.. ఆరేళ్ల చిన్నారి పేరు మార్చాలంటూ కోర్టుకెక్కిన తల్లిదండ్రులు.. ఏమయిందంటే..

అలెక్సా అనే తమ చిన్నారి పేరు మార్చాలంటూ తల్లిదండ్రులు కోర్టుకు ఎక్కారు. ఆ పేరుతో చిన్నారిని మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు పేరు మార్పుకు అంగీకరించింది. 

Parents Changed six year old girl name due to Hey Alexa bullying in Germany
Author
First Published Sep 1, 2022, 2:10 PM IST

జర్మనీ : కొన్నిపేర్లు కొన్నిసార్లు చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. దీనికి చక్కటి ఉదాహరణ పాతతరం నటి సూర్యకాంతం. గయ్యాళి అత్తగా ఆమె సినిమాల్లో హీరోయిన్లను అష్టకష్టాలు పెట్టేవారు. దీంతో అది నటన అని తెలిసినా, ఆమె సహజంగా చాలా మంచిదని తెలిసినా.. ఆ పేరును తమ పిల్లలకు పెట్టడానికి తలిదండ్రులు భయపడేవారట. పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఆ పేరు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే ఇప్పుడు జర్మనీలో ఒకటి చోటు చేసుకుంది. ఓ డివైజ్ వల్ల తమ కూతురు ఇబ్బందులు పడుతోందని.. కూతురు పేరు మార్చమంటూ తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెడితే...

జర్మనీలో ఒక మహిళ తన కూతురికి అలెక్సా అనే పేరు పెట్టుకుంది. ఆ చిన్నారికి ఆరేళ్లు. న్యూయార్క్ పోస్ట్‌ నివేదిక ప్రకారం, ఆ చిన్నారి.. అలెక్సా అనే తన పేరు వల్ల పాఠశాలలో ఇబ్బందులకు గురవుతుంది. టీజింగ్ చేస్తున్నారు. ఆరేళ్ల వయస్సు ఉన్న బాలిక అది తట్టుకోలేక బాధపడుతుందని ఆ నివేదిక తెలిపింది. అమెజాన్ అలెక్సా డివైజ్‌లు మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్న సమయంలో ఆ చిన్నారి పుట్టింది. ఆ సమయంలోనే వారు ఆమెకు అలెక్సా అనే పేరు పెట్టారు. ఇది యాదృచ్ఛికమే అయినా.. ఆ పేరుతో ఆ చిన్నారిని టీజ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసేవారు పెరిగిపోతున్నారట.

అమెజాన్ ప్రవేశపెట్టిన అలెక్సా డివైజ్ గురించి తెలిసిందే. వాయిస్ కమాండ్స్ తో పనిచేసే ఈ డివైజ్ అనతికాలంలోనే ప్రజాదరణ పొందింది. అయితే ఇదే జర్మనీలోని గోటింగెన్ లో ఉండే చిన్నారి కష్టాలకు కారణం అయ్యింది. అమ్మాయి పేరు తెలిసినవారు అమ్మాయి ఎక్కడికి వెళ్లినా అక్కడ ‘అలెక్సా’ అంటూ వాయిస్ కమాండ్ లు ఇస్తున్నారు. స్కూల్‌మేట్‌లు ఆమెను ఎగతాళి చేస్తున్నారని పోస్ట్ తన నివేదికలో పేర్కొంది. ఆమె స్విమ్మింగ్ కు వెడితే.. స్కూల్ కు వెడితే, ప్లే గ్రౌండ్ కు వెడితే, చదువుకుంటుంటే.. క్లాస్ రూంలో ఇలా అమ్మాయి ఇబ్బంది పడిందట.

గర్భిణి అయిన భారత పర్యాటకురాలి మృతి.. రాజీనామా చేసిన పోర్చుగల్ ఆరోగ్య శాఖ మంత్రి

ఇక ఒకసారైతే ఆమెకు అస్సలు పరిచయం లేని ఓ వ్యక్తి.. అమ్మాయి పేరు వినగానే "అలెక్సా, నా కోసం డ్యాన్స్ చేయి" అని టీచ్ చేశాడని.. ఆమె తల్లి చెప్పుకొచ్చింది. అలాంటి అవమానాలు, అవహేళనలు చిన్నారి ఎదుర్కోకుండా ఆమె పేరు మార్చాలనా దీనికోసం పోల్ నిర్వహించాలని 
ఆమె తల్లిదండ్రులు  గోట్టింగ్‌హెన్‌లోని నగర అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వీరి ప్రయత్నం విఫరం అయ్యింది. అధికారులు వీరి దరఖాస్తులు తిరస్కరించారు. దీంతో వారు నగరం అడ్మినిస్ట్రేటివ్ కోర్టును ఆశ్రయించారు.

ఆస్ట్రేలియాకు చెందిన పేరెంటింగ్ బ్రాండ్ కిడ్‌స్పాట్ ‘అలెక్సా’ అనే పేరుతో అమ్మాయి "మానసికంగా ఒత్తిడికి" గురయ్యిందని కోర్టు అధికారులు అంగీకరించారని నివేదించింది. "పేరును ఒక శ్లేషగా వాడుతున్నారని, అవమానకరమైన, కించపరిచే ఉత్తర్వులను జారీ చేయడానికి వాడుతూ ఇబ్బందులకు గురిచేసేలా ఉంది’ అని కోర్టు తన ఆర్డర్‌లో పేర్కొంది, అంతేకాదు తల్లిదండ్రులు తమ కుమార్తెకు కొత్త పేరును ఎంచుకోవడానికి అనుమతించింది. అయితే, ఆ చిన్నారికి ఏం పేరు పెట్టారనేది తెలియరాలేదు.

'అలెక్సా' ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వాయిస్ కమాండ్ డివైజ్. అమెజాన్ వారిది.. ఒక్క జనవరి 2019లోనే 100 మిలియన్లకు పైగా డివైజ్ లు అమ్ముడుపోయాయని అమెజాన్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios