ఒక ఇంట్లో దంపతులు, ఇద్దరు చిన్నారులు, మూడు కుక్కలు దారుణ హత్య.. ఎలా వెలుగులోకి వచ్చిందంటే!

ఒక ఇంట్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నపిల్లలు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు వారితో పాటు,  వారికి చెందిన మూడు కుక్కలను కూడా కాల్చిచంపారు.

Parents 2 children and 3 dogs found shot In Chicago Home ksm

ఒక ఇంట్లో దంపతులు, వారి ఇద్దరు చిన్నపిల్లలు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు వారితో పాటు,  వారికి చెందిన మూడు కుక్కలను కూడా కాల్చిచంపారు. ఈ ఘటన అమెరికా చికాలోని రోమియోవిల్లేలో చోటుచేసుకుంది. వివరాలు.. బాధిత కుటుంబం పనికి వెళ్లకపోవడం, బంధువుల నుండి వచ్చిన ఫోన్ కాల్‌లకు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యుడు ఒకరు వెల్ఫేర్ చెక్ కోసం పోలీసులను సంప్రదించారు. దీంతో రోమియోవిల్లేలో వారి ఇంటి వద్దకు ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో పోలీసులు చేరుకున్నారు. 

అయితే అక్కడ పోలీసులు మృతదేహాలను గుర్తించారు. అల్బెర్టో రోలోన్, జోరైడా బార్టోలోమీ, వారి ఇద్దరు పిల్లలు 10 ఏళ్ల అడ్రియల్, 7 ఏళ్ల డియెగోతో పాటు వారి మూడు కుక్కలను దుండగులు శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున మధ్యలో కాల్చి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

రోమియోవిల్లే పోలీస్ డిప్యూటీ చీఫ్ క్రిస్ బర్న్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ మరణాలు హత్య అనంతరం ఆత్మహత్య ఫలితంగా జరిగినట్లు తాము నమ్మడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనను హత్య కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసుల వర్గాలు తెలిపాయి.  ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులు నివేదించబడనప్పటికీ.. ఘటన జరిగిన చుట్టుపక్కల కమ్యూనిటీకి ప్రమాదం ఉందని తాను నమ్మడం లేదని క్రిస్ బర్న్ చెప్పారు. 

తమ డిటెక్టివ్‌లు, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్‌లు గత 36 గంటలపాటు పలు భౌతిక సాక్ష్యాలను సేకరించారని తెలిపారు. ఇది యాదృచ్ఛిక సంఘటన కాదని, షెల్టర్-ఇన్-ప్లేస్ ఆర్డర్ కోసం ఎటువంటి కారణం లేదని తాము గుర్తించగలిగామని పేర్కొన్నారు. ఈ ఘటనపై క్షుణ్ణంగా  దర్యాప్తు చేయడం ముఖ్యమని చెప్పారు. తమ యంత్రాంగం అదే పనిలో ఉన్నారని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios