బాత్ టబ్ లో రిపోర్టింగ్.. న్యూస్ లా చెబితే పట్టించుకోవట్లేదని

Pakistani TV Reporter Reporting On Kids Bath Tub
Highlights

న్యూస్ ని న్యూస్ లా చెబితే ఎవరూ పట్టించుకోవడం లేదట. అందుకే ఈ రిపోర్టర్  కాస్త సృజనాత్మకత జోడించాడు

అందాల తార శ్రీదేవి చనిపోయినప్పుడు ఓ టీవీ రిపోర్టర్ అత్యుత్సాహంతో బాత్ టబ్ లో పడుకొని రిపోర్టింగ్ చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇలాంటి సీనే మరోసారి రిపీట్ అయ్యింది. కాకపోతే.. ఈ రిపోర్టర్ మాత్రం ఓ మంచి కోసం అలా చేశాడు. ఈ సంఘటన పాకిస్థాన్ లో చోటుచేసుకుంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే...లాహోర్ లో వర్షాలు పడగానే రోడ్ల మీద భారీగా వరదనీరు చేరి ప్రజలకు నానా ఇబ్బందులూ కలిగిస్తోంది.  స్థానికులు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడంలేదు. 

దీంతో ఓ రిపోర్టర్‌కు అధికారుల తీరుపై ఆక్రోషం కలిగింది. ఆ ఆక్రోషంలోంచి ఓ ఆలోచన కూడా వచ్చింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టాడు. వార్తను వార్తలా చెప్తే అధికారుల బుర్రకు ఎక్కటం లేదని దానికి ఓ ఎపెక్ట్ ఇచ్చాడు. ఆ వరదనీటిలో పిల్లల స్నానాలకు వాడే బాత్‌టబ్ లో కూర్చొని రిపోర్టింగ్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

loader