హైదరాబాద్: తమ భర్తకు ముగ్గురు భార్యలు నాలుగో భార్య కోసం వెతుకుతున్నారు. ఈ మేరకు నాలుగో భార్య కోసం వారు ప్రకటన ఇచ్చారు.ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

పాకిస్తాన్ లోని సియాల్‌కోట్ కు చెందిన అడ్నాన్ అనే వ్యక్తికి ఇప్పటికే ముగ్గురు భార్యలున్నారు. ఆయన వయస్సు 22 ఏళ్లు.  మరో పెళ్లి కోసం ఆయన ముగ్గురు భార్యలు ప్రయత్నిస్తున్నారు. నాలుగో పెళ్లి కోసం ముగ్గురు భార్యలు ప్రయత్నిస్తుండడం విశేషం.

ఆడ్నాన్ కు 16 ఏళ్ల వయస్సులోనే మొదటిసారి  పెళ్లైంది. చదువుకొనే సమయంలోనే ఆయనకు పెళ్లైంది.  20 ఏళ్ల వయస్సులో ఆయన రెండో పెళ్లి చేసుకొన్నాడు. గత ఏడాది మూడో పెళ్లి చేసుకొన్నాడు.

నాలుగో పెళ్లి కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు ముగ్గురు భార్యలు కూడ సమ్మతించారు. నాలుగో భార్యగా రావాలని భావించే యువతి ముందుగా తన భర్తతో కలిసి మాట్లాడాలని ముగ్గురు భార్యలు కోరారు.

ఆడ్నాన్ కి నాలుగో భార్యగా రావాల్సిన యువతి పేరు ఎస్ తో ప్రారంభం కావాలని ముగ్గురు భార్యలు షరతు విధించారు.

అడ్నాన్ కి ఇప్పటికే ఐదుగురు సంతానం. అంతేకాదు మరొక పిల్లాడిని కూడ దత్తత తీసుకొన్నారు. మొదటి భార్య షుంబల్ కి ముగ్గురు పిల్లలు, రెండో భార్య షుబానాకి ఇద్దరు పిల్లలు, మూడో భార్య షాహిదా  ఒకరిని దత్తత తీసుకొంది.

తనకు మొదటి పెళ్లి తర్వాత ఆర్ధికంగా కలిసి వచ్చిందని ఆయన చెబుతున్నాడు. తన ముగ్గురు భార్యలు తనతో ప్రేమగా ఉంటారని చెప్పారు. అంతేకాదు తాను కూడ వారిపై అంతే ప్రేమగా ఉంటానన్నారు.

ఈ ముగ్గురు భార్యలు కూడ ఏనాడూ గొడవలు పడలేదు. ముగ్గురు కూడ ప్రేమగా ఉంటారు. అయితే అడ్నాన్ తమకు ఎక్కువగా సమయం కేటాయించడం లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారు.