Asianet News TeluguAsianet News Telugu

కాబోయే భార్యకు ‘గాడిద’ గిఫ్ట్.. పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు ఏమందంటే..

ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు గాడిదను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి వైరల్ గా మారాయి. 

Pakistani man gifts his fiance a donkey, photos, video goes viral
Author
First Published Dec 13, 2022, 9:47 AM IST

పాకిస్తాన్ : జీవితాంతం కలిసి నడవాల్సిన ప్రయాణంలో ఆరంభం అద్భుతంగా ఉండాలని ప్రతి కొత్త జంట కోరుకుంటుంది. దీని కోసం ఒకరి అభిరుచులకు తగ్గట్టుగా మరొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిలో ఎక్కువగా నగలు, బంగారం, దుస్తులు ఉంటాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం తన కాబోయే భార్యకు ఇచ్చిన గిఫ్ట్  ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి కాబోయే భార్య షాక్ అవ్వలేదు కానీ..  మిగతావారంతా ముక్కున వేలు వేసుకున్నారు. ఇంతకీ అంత వెరైటీ గిఫ్ట్ ఏంటి అని అనుకుంటున్నారా?  ఆ వివరాలు తెలియాలంటే పాకిస్థాన్కు వెళ్లాల్సిందే…

పాకిస్తాన్ కు చెందిన అజ్లాన్, వరిషాలకు పెళ్లి కుదిరింది. కాబోయే భార్యకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ వెరైటీ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాడు అజ్లాన్. దీనికోసం బాగా వెతికి.. పెళ్లి మండపంలోనే వధువు కోసం ఓ బహుమతిని రెడీ చేశాడు. ఓ గాడిద పిల్లను తీసుకువచ్చి.. భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అది చూసిన ఆమె చాలా సంతోషపడింది. పెళ్ళికి వచ్చినవారంతా షాక్ అయ్యారు. అయితే,  వధువు జంతు ప్రేమికురాలు కావడంతో... అలా గాడిద పిల్లను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు వరుడు. వీరిద్దరి జీవితాల్లో ఆ క్షణాలు ఎంతో అపురూపం అని వారు చెప్పుకొచ్చారు. వధువు ఇష్టాయిష్టాలను కనుక్కుని ఆ మేరకు  అలాంటి బహుమతిని ఇవ్వడంతో..  ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది. 

25 ఏళ్లలోపు యువతకు ఉచిత కండోమ్‌లు.. జనవరి నుంచి స్కీమ్ అమలు.. ఎక్కడంటే?

తరువాత విషయం తెలిసిన బంధువులు, స్నేహితులు,పెళ్లికి వచ్చిన వారు కూడా వరుడి చర్యకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.  దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. భార్యకు మొదటిసారిగా ఇచ్చే గిఫ్ట్ ను గాడిదని ఎందుకు ఎంచుకున్నారు అని.. వధువు అతడిని అడిగింది. దీనికి అతను సమాధానం చెబుతూ..‘నీకు అది అంటే ఇష్టం.. ఇక రెండో కారణం  ప్రపంచంలోనే అత్యంత కష్టపడే జంతువు గాడిద. అంతేకాదు అత్యంత ప్రేమగా ఉండే జంతువు కూడా గాడిదే’ అని బదులిచ్చాడు.

చిన్న గాడిద పిల్లను తీసుకు వచ్చి తనకు గిఫ్ట్ గా ఇవ్వడం ద్వారా తల్లి నుండి వేరు చేసినట్లుగా భావించరాదని.. పిల్లలతో బాటు తల్లిని కూడా తీసుకు వచ్చానని, తల్లీ,పిల్లలను వేరు చేయలేదు అని అతను చెప్పుకొచ్చాడు. తనకు కూడా జంతువులు అంటే చాలా ఇష్టం అని.. జనాలు ఏమనుకున్నా పర్లేదు అని.. తన భార్యకు ఇదే తానిచ్చే అపురూపమైన కానుక అని పేర్కొన్నాడు. అజ్లాన్ మాటలు విన్న వారిశా… ఈ బహుమతిని తాను కేవలం గాడిదలా మాత్రమే చూడడం లేదని తెలిపింది. 

ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. కొందరేమో ‘గాడిదని గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి బ్రో’ అంటూ నవ్వుతూ ఉంటే... మరికొందరు చూడముచ్చటగా ఉంది అని మెచ్చుకుంటున్నారు. వీరి జంటలాగే గాడిద పిల్ల కూడా చాలా క్యూట్గా ఉందనీ.. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దని.. జీవితాంతం మీరు ఇలాగే, నవ్వుతూ హాయిగా సుఖంగా ఉండాలని..  మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios