భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో పాక్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అంటూ జరిగితే అది రెండో ప్రపంచ యుద్ధం కంటే భయంకరంగా ఉంటుందన్నారు.

బహుశా భారత్-పాక్ మధ్య ఇదే చివరి యుద్ధం కావొచ్చని రషీద్ అభిప్రాయపడ్డారు. వచ్చే 72 గంటలు రెండు దేశాలకు అత్యంత కీలకమన్నారు. యుద్ధమా, శాంతా అనేది 72 గంటల్లో తేలిపోతుందని రషీద్ తేల్చి చెప్పారు.