Asianet News TeluguAsianet News Telugu

ఆరెస్సెస్‌ను నాజీతో పోల్చిన ఇమ్రాన్: బీజేపీపై సంచలన వ్యాఖ్యలు

ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకాశ్మీర్ విభజనపై భారత్ తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్ధితిలో పడిపోయిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన నోటీ దురుసును ప్రదర్శించారు. కాశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చే క్రమంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.

Pakistan Prime Minister imran khan sensational comments on bjp over scrapping of article 370
Author
Islamabad, First Published Aug 11, 2019, 4:36 PM IST

ఆర్టికల్ 370 రద్దుతో పాటు జమ్మూకాశ్మీర్ విభజనపై భారత్ తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్ధితిలో పడిపోయిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన నోటీ దురుసును ప్రదర్శించారు. కాశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చే క్రమంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.

ఆరెస్సెస్‌ను నాజీతో పోల్చిన పోల్చిన ఆయన హిందూ ఆధిపత్య ధోరణి కలిగిన ఆరెస్సెస్ కనుసన్నల్లోనే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. ఇది భారతదేశంలో ముస్లింలను అణచివేయడానికి దారి తీసి చివరికి పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుంటుందని ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

నాజీ ఆర్యన్ ఆధిపత్యం వలె హిందూ ఆధిపత్యంతో కూడిన ఆరెస్సెస్ భావజాలంపై తాను కలత చెందుతున్నానని ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు సంధించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకోవడంతో పాటు ఇస్లామాబాద్‌లోని భారత రాయబారిని ఇమ్రాన్ ఖాన్ బహిష్కరించిన సంగతి తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios